Bloating: తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అయితే ఈ డ్రింక్ తాగండి.

Bloating
x

Bloating: తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అయితే ఈ డ్రింక్ తాగండి

Highlights

Stomach Bloating Problem: చాలామందికి తిన్న తర్వాత పొట్ట పట్టేసినట్టు, బాగా బరువు పెరిగినట్టు, పొట్ట పెద్దగా మారినట్టు ఉంటుంది. మరికొంతమందికి గ్యాస్ లీక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.

తిన్న తర్వాత పొట్ట ఉబ్బరం

పప్పు తిన్న రోజు గ్యాస్ట్రిక్ సమస్యలు

ఈ హెల్త్ డ్రింక్ తాగితే సమస్యలు దూరం

హెల్త్ డ్రింక్ రెసిపీని వెల్లడించిన నాగ్ పాల్

Stomach Bloating Problem: చాలామందికి తిన్న తర్వాత పొట్ట పట్టేసినట్టు, బాగా బరువు పెరిగినట్టు, పొట్ట పెద్దగా మారినట్టు ఉంటుంది. మరికొంతమందికి గ్యాస్ లీక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా శనగలు, పప్పు, రాజ్మా వంటి ఫుడ్ తిన్నప్పుడు ఈ సమస్యలను చాలామంది ఎదుర్కుంటూ ఉంటారు. అయితే వీటికి ఒక మంచి డ్రింక్ ఉందని ఇటీవల పోషకాహార నిపుణురాలు పాలక్ నాగ్ పాల్ చెప్పారు. ఈ డ్రింక్ ఎలా పని చేస్తుంది. ఈ డ్రింక్‌ని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఆమె తన ట్విట్టర్ ద్వారా వివరించారు.

ఇటీవల కాలంలో చాలామంది పొట్టనిండా తినేసి కూర్చుని ఉంటున్నారు. ఇలా తినేసి కూర్చున్న వారిలో జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ , ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరి వీటిని బయటపడేది ఎలా? తిన్న తర్వాత ఎందుకు అంత తిన్నాంరా బాబూ అని అనుకుంటూ పొట్టపై చేతులు పెట్టి తిప్పుకుంటూ మరికొందరు తిరుగుతుంటారు. ఇలా ఒకేసారి ఇంత తింటే ప్రమాదకరమా? అంటే పోషకాహార నిపుణురాలైన పాలక్ నాగ్ పాల్ ఏమంటున్నారంటే తింటే తిన్నారు కానీ ఆ తర్వాత ఒక హెల్త్ డ్రింక్ తాగమని చెబుతున్నారు. జీలకర్ర, సోంపుతో ఈ డ్రింక్‌ని తయారు చేసి గోరువెచ్చగా తాగమంటున్నారు.

ఎక్కువ తిన్నా, తిన్నవెంటనే కూర్చుని ఉన్నా, పప్పులు, రాజ్మా, శనగలు వంటి ఆహారాలు తిన్నా.. ఈ డ్రింక్ తాగితే వెంటనే రిలీఫ్ ఉంటుందని నాగ్ పాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. గోరువెచ్చగా తాగడం వల్ల ఈ డ్రింక్ కడుపులోకి వెళ్లి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.

హెల్త్ డ్రింక్ తయారీ విధానం

1 టీ స్పూన్ జీలకర్ర

1 టీ స్పూన్ సోంపు

1 లీటరు నీళ్లు

ఒక లీటరు నీళ్లలో సోంపు, జీలకర్ర వేసి అరలీటరు అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా తాగాలి. ఒకేసారి అరలీటరు తాగొచ్చు లేదంటే కొంచెం కొంచెంగా తాగొచ్చు. ఈ డ్రింక్‌ పిల్లలకు, వృద్ధులకు కూడా ఇవ్వొచ్చు. భోజనం తర్వాత మాత్రమే తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories