మతిమరుపు మాయం కావాలంటే..

మతిమరుపు మాయం కావాలంటే..
x
Highlights

ఉరకలు పరుగుల జీవితంలో మతిమరుపు ఉంటే మాత్రం పలు రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే. అలాగేవయసు పెరిగే కొద్దీ కూడా మెదడు పని తీరు కాస్త మందగిస్తుంది. ఆలోచనా...

ఉరకలు పరుగుల జీవితంలో మతిమరుపు ఉంటే మాత్రం పలు రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే. అలాగేవయసు పెరిగే కొద్దీ కూడా మెదడు పని తీరు కాస్త మందగిస్తుంది. ఆలోచనా శక్తి, తెలివితేటల్లో తేడా వస్తుంది. అయితే మెుదడు పనితిరులో తేడా రాకుండా ఉండాలంటే ఆహార విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా తిసుకునే ఆహారంలో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.

మతిమరుపు సమస్యలు రాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. విటిని తినడం వల్ల మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా ఉండేందుకు ఫోటోకెమికల్స్ వాటిలో ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి మెుదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో వీటి పాత్ర ఆనిర్వచనీయం. ఒత్తిళ్ళను దూరం చేయడంలో కూడా ఇవి డతోడ్పడతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories