మెుదడుకు శక్తిని ఇచ్చే బంగాళాదుంప

మెుదడుకు శక్తిని ఇచ్చే  బంగాళాదుంప
x
Highlights

మానువుడికి తప్ప ఈ సృష్టిలో ఏ ఇతర జంతువు కూడా శరీర పరిమాణానికి తగిన మెదడు పరిమాణం లేదు. మనిషిలో ఈ విధంగా మెదడు పెరగడానికి కారణం పిండిపదార్థాలేనట. ఇవి...

మానువుడికి తప్ప ఈ సృష్టిలో ఏ ఇతర జంతువు కూడా శరీర పరిమాణానికి తగిన మెదడు పరిమాణం లేదు. మనిషిలో ఈ విధంగా మెదడు పెరగడానికి కారణం పిండిపదార్థాలేనట. ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడి మెదడు అభివృద్ధి చెందడంలో కార్బోహైడ్రేట్లు తోర్పాడుతున్నాయి బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రాచీనకాలంలో మానవుడికి బంగా ళాదుంపలు, గింజలు, పండ్ల తినేవారని వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేదని పరిశోధనల్లో తెల్చారు. వారి పరిశోధనలో భాగంగా పురావస్తు, మానవ విజ్ఞాన శాస్త్రాలు ఇతర పరిశోధన ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ప్రస్తుత ఆహరపు అలవాట్లలో మనిషి తీసుకునే మాంసం ద్వారానే శరీరానికి ఎక్కవుగా లభిస్తున్నాయి. అయితే వాటికంటే ఎక్కువగా ప్రకృతిలో లభించే పిండిపదార్థాలు మానవుడి మెదడు ఎదుగుదలకు చాలా ఉపకరిస్తాయి. రక్తంలోని 60శాతం గ్లూకోజ్‌ని, శరీరంలోని 25శాతం శక్తినీ మెదడు వాడుకుంటుంది. కొన్నిసార్లు శరీరంలో కార్బోహైడ్రేట్లు ప్థాయి తక్కువైనప్పుడు మెదడుకి సరైన పరిమాణంలో గ్లూకోజ్‌ అందదు. అందువల్ల పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల మెదడు పరిమాణంగానీ, పనితీరుగానీ మెరుగ్గా ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories