వర్షాకాలం పాముల బెడదకు చెక్! ఈ వాసనలతో పాములు వెంటనే తోకముడుస్తాయి

వర్షాకాలం పాముల బెడదకు చెక్! ఈ వాసనలతో పాములు వెంటనే తోకముడుస్తాయి
x

వర్షాకాలం పాముల బెడదకు చెక్! ఈ వాసనలతో పాములు వెంటనే తోకముడుస్తాయి

Highlights

వర్షాకాలం వచ్చిందంటే పాముల బెడద ప్రారంభమవుతుంది. ముఖ్యంగా విషపూరిత పాములు ఈ కాలంలో ఎక్కువగా బయటకు వస్తాయి, ఎందుకంటే వాటి గూళ్లు నీటితో నిండిపోతాయి. అయితే, ఈ భయం నుంచి బయటపడే మార్గాలు మన ఇంట్లోనే దాగి ఉన్నాయి.

Snake Alert During Monsoon: వర్షాకాలం వచ్చిందంటే పాముల బెడద ప్రారంభమవుతుంది. ముఖ్యంగా విషపూరిత పాములు ఈ కాలంలో ఎక్కువగా బయటకు వస్తాయి, ఎందుకంటే వాటి గూళ్లు నీటితో నిండిపోతాయి. అయితే, ఈ భయం నుంచి బయటపడే మార్గాలు మన ఇంట్లోనే దాగి ఉన్నాయి. పాములకు కొన్ని వాసనలు అసహ్యంగా ఉంటాయి. వాటిని పీసులా చల్లితే, ఆ ప్రాంతానికి పాములు దరిచేరవు.

తులసి, వెల్లుల్లి, ఉల్లిపాయ, దాల్చిన చెక్క వాసనలు పాములకు అసహ్యం. ఈ పదార్థాలను నలిపి వాటి నీటిని లేదా నూనెలను పిచికారీ చేస్తే, పాములు ఆ వైపు చూడడమే మానేస్తాయి. దానికి తోడు సల్ఫర్ పౌడర్, నాఫ్తలీన్ వాసనలూ పాములకు భయాన్ని కలిగిస్తాయి. ఇవి తోటలకైనా, ఇంటి తలుపులకైనా చల్లితే పాములు దగ్గర పడవు.

దాల్చిన చెక్క నూనె, లవంగ నూనె కూడా ప్రభావవంతమైన పాము వికర్షకాలు. వాటి వాసన పాములకు అసహనం కలిగిస్తుంది. ఈ నూనెలను సూటిగా పాములు వచ్చే ప్రదేశాల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది. నూనెలు ఖరీదుగా ఉంటే పౌడర్ రూపంలోనైనా వాడవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ పొడులు కూడా పాములకు అసహ్యం కలిగించే వాసనలు. ఇవి పాముల దిశాపట్టికను దెబ్బతీస్తాయి, అందువల్ల అవి తప్పు దిశగా వెళ్లిపోతాయి.

అంతేకాక, నాఫ్తలీన్ టాబ్లెట్లు కూడా మంచి పరిష్కారం. సాధారణంగా బీరువాల్లో దుస్తుల కోసం ఉపయోగించే ఈ టాబ్లెట్లు పాములకు ఘాటైన వాసనతో భయపెడతాయి. వీటిని ఇంటి మూలల్లో, కిటికీల దగ్గర, తోటల్లో ఉంచితే పాములు ఆ దిశగా రావు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వాసనలు పాముల దృష్టిని మళ్లించడమే కాదు, వాటి దిశ తెలిసే శక్తినీ దెబ్బతీయగలవు.

ఇలాంటివి వాడేటప్పుడు ఒక జాగ్రత్త—ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వీటిని జాగ్రత్తగా వాడాలి. వాసనల ప్రభావం వారికి ఇబ్బంది కలిగించకుండా చూడాలి. ఒకవేళ ఈ పద్ధతులు ఉపయోగించలేరు అనుకుంటే, పాములు రాకుండా ఇంటి చుట్టూ గల రంధ్రాలను మూసివేయండి. వర్షాకాలం రాకముందే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచితే, పాములకు ఆశ్రయం దొరకదు.

ఈ చిట్కాలు సాధారణ సమాచార కోసం మాత్రమే. మీ ఇంటి పరిసరాల భద్రత గురించి మరింత సమాచారం కావాలంటే, నిపుణులను సంప్రదించడం మంచిది. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పాముల బెడదతో చింతించాల్సిన అవసరం లేదు!

Show Full Article
Print Article
Next Story
More Stories