రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ స్మార్ట్‌ఫోన్ వాడితే..!

రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ స్మార్ట్‌ఫోన్ వాడితే..!
x
Highlights

స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని వారు చాల మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ల వల్ల ఉపయోగం ఎంతో ఉందో.. అంతకంటే ఎక్కువ నష్టం కూడా...

స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని వారు చాల మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ల వల్ల ఉపయోగం ఎంతో ఉందో.. అంతకంటే ఎక్కువ నష్టం కూడా ఉందంటున్నారు సైంటిస్టులు. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వీటిని వాడితే అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇటీవల సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ పై అధ్యయనం చేశారు. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు డైలీ ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు. ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన విషయం ఎంటంటే.. రోజు 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే స్టూడెంట్స్ స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. దీనివల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వారు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories