స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించుకోకుంటే ఈ సమస్యలు తప్పవు..

స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించుకోకుంటే ఈ సమస్యలు తప్పవు..
x
Highlights

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అది లేనిది ఎవరికీ రోజు గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌తోనే అనేక పనులను ఇంటి నుండే...

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అది లేనిది ఎవరికీ రోజు గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌తోనే అనేక పనులను ఇంటి నుండే చేసేస్తున్నాం. అందరూ దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. అయితే స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలున్నా, దానిని అధికంగా వాడితే అనారోగ్యాలు తప్పవు. రోజులో 5 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు 1060 మందిపై శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాల్లో ఇది విషయంలో వెల్లడైంది.

స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెల్చింది. ఆ విద్యార్థులకు గల ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను కూడా సైంటిస్టులు సేకరించారు. నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతున్నారు అనే తదితర వివరాలను కూడా రాబట్టారు. ఈ పరిశోధనలలో చివరకు తేలిందేమిటంటే, నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉన్నాయి తేలిపారు. వారికి 42.6 శాతం వరకు సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే పెద్ద ముప్పు కంటిచూపు దెబ్బతినిపోవడం. కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే నీలి కాంతి దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మయోపియా (దగ్గర దృష్టి) పెరిగిపోతుంని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హాని కలుగుతుందని చాలా అధ్యయనం వివరిచింది. అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి పడకగదిలో స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ వంటి వాటిలో ఏదైనా పట్టుకున్నారంటే నిద్ర సరిగా పట్టదు. దీంతో నిద్రాభంగాన్ని ఎదుర్కొంటున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories