Sleeping Tips: మీకు నిద్ర రావడం లేదా? ఈ ఆహారం తింటే మీకు మంచి నిద్ర పడుతుంది

Sleeping Tips
x

Sleeping Tips: మీకు నిద్ర రావడం లేదా? ఈ ఆహారం తింటే మీకు మంచి నిద్ర పడుతుంది

Highlights

Sleeping Tips: సాధారణంగా చాలామందికి ఎంత అలసిపోయినా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా వెంటనే లేచి కూర్చుంటారు.

Sleeping Tips: సాధారణంగా చాలామందికి ఎంత అలసిపోయినా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా వెంటనే లేచి కూర్చుంటారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటికో నిద్ర పడుతుంది. దీంతో నిద్రలేక, ఉదయాన్నే లేవలేక లేచి.. ఇక అందరి మీద చిరాకు చూపిస్తారు. వారిలో వారే సతమతమైపోతుంటారు. అయితే ఇలాంటి ఈ స్లీప్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటే.. వెంటనే నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారపదార్దాలేంటో చూసేద్దామా..

కొన్ని ఆహారపదార్దాలు అలాగే పానీయాలు నిద్రకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ ఆహార పదార్ధాలు తిన్న తర్వాత మీ మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటుంది. మరి నిద్రను ప్రేరేపించే ఈ ఆహారపదార్దాలను మీరు తింటే గుర్రుమని నిద్రపోతారు.

బాదాం

బాదాం తింటే చాలామంచిదనే విషయం అందరికీ తెలుసు. కానీ నిద్రపోయే ముందు నాలుగు బాదం పప్పులు మెత్తగా నమిలి తింటే మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే నాడీవ్యవస్థను నియంత్రించడంలో బాదాం కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే మెగ్నీషియం మీ కండరాలను సడలిస్తుంది. అలాగే ఇది మెలటోనిన్‌ని ఉత్పత్తి చేసి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

చెర్రీస్

చెర్రీస్‌లో నిద్రను ప్రేరేపించే పోషకాలు ఉన్నాయి. నిద్ర చక్రాన్ని నియంత్రించే మెలటోనిన్ పుష్కలంగా ఉంది. రోజుకు రెండు కప్పులు చెర్రీస్ జ్యూస్ తాగితే నిద్ర బాగా పడుతుంది. చెర్రీస్‌లో యాంటీ యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో పూర్తిగా సహాయం చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలని అనుకునేముందు ఒక కప్పు చెర్రీజూస్ తాగండి.

అరటిపండ్లు

ప్రతిరోజూ పడుకునే ఒక గంట ముందు అరటిపండు తినండి. పోటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ పండు నిద్ర పట్టడానికి బాగా దోహదం చేస్తుంది. కండరాలను సడలించి, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అరటిపండులో ఉంటే ట్రిప్టోఫాన్ ఆ తర్వాత నెమ్మదిగా మెలటోనిన్‌గా మారుతుంది. అందుకే అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుంది.

సాల్మన్ చేప

విటమిన్ డి, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ చేపలు వంటి చేపలను తింటే శరీరానికి ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. ఇవి సెరోటోనిన్‌ను నియంత్రిస్తాయి. మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నిద్రబాగా పడుతుంది.

కివి

నిద్రపోయే ముందు కివి పండుని తింటే చాలామంచిది. ఎందుకంటే కివి సెరోటోనిన్ అనే హార్మోన్‌ని కలిగి ఉంటుంది. నిద్రపోయే ఒక గంట ముందు ఒక రెండు పండ్లు తింటే శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. మంచిగా నిద్ర కూడా పడుతుంది.

అయితే ఈ పండ్లలో ఏ పండ్లు తిన్నా... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిసిన వాళ్లు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా ప్రకారం పండ్లను తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories