నిద్రపోతే చాలు.. రూ. 48 లక్షలు ఇస్తారట!

నిద్రపోతే చాలు.. రూ. 48 లక్షలు ఇస్తారట!
x
Highlights

నిద్రపోతే రూ. 48 లక్షలు ఇవ్వటమంటా అని అనుకుంటున్నారా.. మీరు చదువుతున్నది నిజం. రోజు నిద్రపోతే చాలు ఏడాదికి రూ. 48 లక్షలు ఇస్తారు. ఇంతకీ అంత డబ్బు...

నిద్రపోతే రూ. 48 లక్షలు ఇవ్వటమంటా అని అనుకుంటున్నారా.. మీరు చదువుతున్నది నిజం. రోజు నిద్రపోతే చాలు ఏడాదికి రూ. 48 లక్షలు ఇస్తారు. ఇంతకీ అంత డబ్బు ఎందుకిస్తారంటే.. ఆ ఉద్యోగమే నిద్రపోవటం. నిద్రపోయే ఉద్యోగం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి..! నిజంగానే ఇలాంటి ఉద్యోగం ఉంది. కాకపోతే ఇది మన దగ్గర కాదు.. విదేశాల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి.

పరుపులు తయారు చేసే సంస్థలు తాము తయారు చేసిన పరుపుల నాణ్యతను చెక్ చేసుకుంటు ఉంటాయి. ఇందుకోసం నిపుణులను నియమిస్తాయి. వారు చేసేదల్లా పరుపుపై నిద్రపోవడమే. ఆ తర్వాత పరుపు నాణ్యత ఎలా ఉంది? నిద్ర ఎలా పడుతుంది. అసలు నిద్ర పడుతోందా లేదా అన్న విషయాన్ని సంస్థకు తెలియజేస్తారు. ఇలా చేయటానికి ఆ సంస్థ.. నిపుణులకు ఏడాదికి 70వేల డాలర్ల (48,31,295 రూపాయిల ) జీతం చెల్లిస్తారు. పరుపుల మీద నిద్రపోయినందుకు అన్ని డబ్బులిస్తారు. ఇదేదో బాగుంది కదా. వీలైతే మీరు కూడా ప్రయత్నించండి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories