దృఢమైన శరీరానికి స్కిప్పింగ్‌ ఎంతో ఉపయోగం..

దృఢమైన శరీరానికి స్కిప్పింగ్‌ ఎంతో ఉపయోగం..
x
Highlights

రకరకాల వ్యాయామాలతో చాలా మంది తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., మరికొందరు ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని...

రకరకాల వ్యాయామాలతో చాలా మంది తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., మరికొందరు ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని అనుకుంటారు. ఉదయం లేవగానే రకరకాలైన వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఒకే ఒక్క ఎక్స్‌సైజ్‌తో శరీరం మెుత్తాన్ని దృఢంగా మారుచ్చుకోవచ్చ.ని నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్‌తో మన బాడీని స్ట్రాంగ్‌గా చేసుకోవచ్చని అంటున్నారు.

* శరీరం మొత్తాన్ని స్కిప్పింగ్‌తో ఫిట్‌గా ఉంచుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. శరీరంలోని అవయవాల కదిలికలను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయం చేయడానికి స్కిప్పింగ్ ఉపయోగపడుతుందట.

* ప్రతి రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడంగా మారడంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. స్కిపింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయటం వల్ల అరికాళ్లకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పాదాలలో పగుళ్లు ఏర్పడతాయి. అలాగే కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేయకూడదు. తాడుతో స్కిప్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది.

* బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దాన్ని ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం మంచిది. దీంతో శరీరం ఉల్లాసంగా ఉంటుంది. భుజాలు, తొడలు, చేతులు,పొట్ట భాగంలో ఏర్పడిన కొవ్వు నిల్వలు కరిగిపోయి కండరాలు బలంగా తయారవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories