Top
logo

చలికాలంలో చర్మ సంరక్షణ ఇలా!

చలికాలంలో చర్మ సంరక్షణ ఇలా!
X
winter care representational image
Highlights

చలి చక్కిలిగింతలు పెడుతుంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి? దాదాపుగా అందరికీ చలికాలం అంటే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

చలి చక్కిలిగింతలు పెడుతుంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి? దాదాపుగా అందరికీ చలికాలం అంటే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. తెల్లవారుజామున కురిసే మంచు చూడాలని కొందరు ఆసక్తి చూపిస్తారు. చలి వేస్తుంటే..దుప్పటి ముసుగేసుకుని మరికొంత సేపు నిద్రపోతూ ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిన్చాలనుకునే వారు కొందరు. ఇలా ఎవరికి వారు చలికాలం సరదాగా గడిపే కాలంగా భావిస్తారు. ఇక చలిపులిని తప్పించుకుని వెచ్చదనాన్ని ఆహ్వానం పలకడానికి.. స్వెట్టర్లు, బూట్లు, సాక్స్ లు ఇలా రకరకాల వాటిని వినియోగిస్తారు. ఎన్నివిధాలుగా చలిని తరిమేద్దామనుకున్నా.. చాలా మందికి ఒక పెద్ద సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అదే చర్మం పోదిబరిపోవడం. మనలో చాలామందికి చలికాలం వస్తూనే పొడి చర్మంతో రకరకాల సమస్యలు వచ్చేస్తాయి.

చలికాలంలో ఎదురయ్యే సమస్యలనుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడడానికి తిప్పలు పడుతుంటారు. ఈ బాధను తప్పించుకోవడానికి ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు, బాదం ఫేస్ ప్యాక్ :

ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు తీసుకొని, ఈ రెండిటిని పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత కొద్దిగా నీరు చిలకరించి మసాజ్ చేసుకోవాలి. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ , పాలలోని మాయిశ్చరైజింగ్ గుణాలు వింటర్ స్కిన్ కేర్ కు చాలా అవసరం. చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. మెరిసేలా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది.

గ్లిజరిన్ :

ముఖం శుభ్రంగా కడిగి, తేమలేకుండా తుడవాలి. తర్వాత కాటన్ బాల్ ను గ్లిజరిన్ లో డిప్ చేసి, పెదాలకు అంటకుండా ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. గ్లిజరిన్ వివిధ రకాల స్కిన్ సమస్యలను నివారిస్తుంది. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మానికి హైడ్రేషన్ ను అందిస్తుంది.

పెరుగు , మజ్జిగా ఫేస్ ప్యాక్ :

పెరుగు, మజ్జిగను సమంగా తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాడీ మొత్తం అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగులో జింక్, క్యాల్షియం, విటమిన్ బి 6, ఇతర ఎంజైమ్స్ ఉన్నాయి. ఇది చర్మంలోని మచ్చలను తేలిక పరుస్తుంది. బట్టర్ మిల్క్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్స్ లో ఉండే పీలింగ్ లక్షణాలు డ్రై అండ్ డల్ స్కిన్ ను క్లియర్ చేస్తుంది.

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఈమూడు పదార్థాలను మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, అరటిలో ఉండే విటమిన్స్ యాంటీఏజెంట్స్ గా పనిచేస్తాయి. తేనె డ్రై స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతంగా..యంగ్ గా కనబడుతారు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెను బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మంలో పూర్తిగా ఇంకిన తర్వాత అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కొబ్బరి నూనె చర్మంను సాప్ట్ గా మార్చుతుంది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీయాసిడ్స్ చర్మంలో కోల్పోయిన మాయిశ్చరైజను తిరిగి తీసుకొస్తుంది. వింటర్ సీజన్ లో కొబ్బరి నూనెను రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మరింత బెనిఫిట్స్ ఉంటాయి.

తేనె, పచ్చిపాలు:

ఒక టేబుల్ స్పూన్ తేనెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు మిక్స్ చేసి, కాటన్ బాల్ ను డిప్ చేసి చర్మానికి అప్లై చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్, ఎగ్ :

గుడ్డు పచ్చసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, కె, విటమిన్ ఎ మరియు లెసిథిన్, చర్మానికి పోషణను అందిస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది.

లెమన్ మరియ హనీ:

హాఫ్ లెమన్ తీసుకుని,అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ డిప్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, తేనెలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, దురద కలిగించే చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. అరటిపండు మాస్క్: సగం అరటిపండు మిశ్రమంలో 1 టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీని బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మంలోకి ఇంకే వరకూ ఒకటి రెండు నిముషాలు మసాజ్ చేయాలి. పెట్రోలియం జెల్లీ చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది.

ఇవన్నీ మన వంటింట్లో దొరికే పదార్థాలే. వీటిలో ఎదో ఒకదాన్ని ప్రయత్నించడం ద్వారా శీతాకాలం మీ చర్మాన్ని పొడిబారకుండా రక్షించుకోవచ్చు. అన్నట్టు.. వీటిని ప్రయత్నించే సమయంలో వీటిలో ఏ పదార్థమైనా మనకి ఎలర్జీ కలిగించేది ఉండవచ్చు. అందువల్ల వీటిని ప్రయత్నించే ముందు ఆ పదార్ధాలని ముందు చేతిపై ఒక చిన్న ప్యాచ్ లా రాసుకుని ఒక 20 నిమిషాల పాటు పరిశీలించాలి. ఎటువంటి ఎలర్జీ లాంటి సమస్యలు తలెత్టకపోతే ఆ పదార్థాలతో చిట్కాలను అనుసరించేయవచ్చు!

Web TitleSkincare tips in Winter
Next Story