బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు..

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు..
x
Highlights

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మ సౌందర్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మకాంతిని మెరుగుపరుస్తాయి. ఎండలో బయటకు వెళ్లే...

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మ సౌందర్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మకాంతిని మెరుగుపరుస్తాయి. ఎండలో బయటకు వెళ్లే వారి చర్మ రక్షణకు బీట్ రూట్ బాగా పనిచేస్తుంది.

* రెండు స్పూన్‌ ల బీట్‌రూట్ రసం, చెంచా పాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖానికి మంచి రంగు వస్తుంది. బీట్‌రూట్ రసం, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

*బీట్‌రూట్ బ్లాక్ హెడ్స్‌ను నివారించడంలోనూ సాయపడుతుంది. దీనికోసం చెంచా బీట్‌రూట్ రసంలో కొంచెం చక్కెర కలిపి మర్దన చేయాలి. దీన్ని వేళ్లతో తీసుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మృధువుగా మసాజ్ చేస్తే 10 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

*కొంచెం బీట్‌రూట్ రసం, ఒక స్పూన్ టమాటా రసం కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే నల్లమచ్చలు తొలిగిపోతాయి. మెడ నల్లగా ఉంటే బీట్‌రూట్ రసం ఐప్లె చేయాలి. దానిపైన ఐస్‌ముక్కతో మర్దన చేస్తూ 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి.

* బీట్‌రూట్ రసాన్ని కళ్లకింద రాసి వేళ్లతో మర్దనా చేయాలి. 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు తొందరగా మాయమవుతాయి. బీట్‌రూట్ రసం, తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories