Beauty Tips: చర్మంపై కాలుష్యం ఎఫెక్ట్‌.. ఈ చిట్కలు పాటిస్తే సహజమైన మెరుపు..!

Skin becomes lifeless due to pollution follow these tips to get natural glow
x

Beauty Tips: చర్మంపై కాలుష్యం ఎఫెక్ట్‌.. ఈ చిట్కలు పాటిస్తే సహజమైన మెరుపు..!

Highlights

Beauty Tips: చర్మంపై కాలుష్యం ఎఫెక్ట్‌.. ఈ చిట్కలు పాటిస్తే సహజమైన మెరుపు..!

Beauty Tips: కాలుష్యం కారణంగా చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ రంధ్రాలలో మురికి పేరుకుపోతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చర్మంపై మొటిమలు కనిపించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చర్మంపై టాన్ పేరుకుపోతుంది. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవటానికి సహజమైన వస్తువులను ఉపయోగించి ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మంలోని టాన్‌ను తొలగించడంలో సహాయపడతాయి. చర్మానికి సహజమైన మెరుపును తీసుకొస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

చందనం, పాలు

గంధం, పసుపు, పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా చందనం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా పాలు, చిటికెడు పసుపు వేయాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. ఇది ముఖంలో మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందడంలో పనిచేస్తుంది.

బొప్పాయి, నిమ్మకాయ

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి గిన్నెలో కొంచెం బొప్పాయిని మెత్తగా చేయాలి. దానికి 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖం, మెడపై పట్టించాలి. అది కొంత సమయం తర్వాత ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ ఇరిటేషన్ ను తొలగిస్తుంది.

పసుపు, తేనె

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది చర్మం నుంచి టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో అర టీస్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. దీనికి ఒక చెంచా తేనె కలపాలి. అందులో కాస్త పసుపు వేయాలి. వీటన్నిటిని బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు చర్మంపై అప్లై చేయాలి. తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories