పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే..

పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే..
x
Highlights

ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. పొట్టచుట్టూ కొవ్వు చేరడంతో పొట్ట బానలా పెరిగిపోయి చూసేందుకు వికారంగా కనబడుతారు. అయితే ఈ సమస్యను...

ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. పొట్టచుట్టూ కొవ్వు చేరడంతో పొట్ట బానలా పెరిగిపోయి చూసేందుకు వికారంగా కనబడుతారు. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపయోగం ఉంటుంది.

గోరువెచ్చని గ్లాస్ నీటిని తీసుకుని వాటిలో అవిసె గింజెల పొడి ఒక టీస్పూన్, కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటు ఉండాలి. ఇది కూడా కొవ్వును తగ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాక ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి. ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా రోజు తీసుకోవడం వల్ల తప్పకుండా కొవ్వు కరుగుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను గ్లాస్ నీటిలో కలిపి ఆహారం తీసుకునే ముందు తాగాలి. అలాగే గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీస్పూన్, అల్లం రసం ఒక టీస్పూన్ మోతాదులో కలుపుకుని రోజుకు రెండుసార్లు దీన్ని తీసుకోవాలి. ఇది పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. గ్రీన్ టీ పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1/4 టీస్పూన్, తేనె 2 టీస్పూన్లు తీసుకుని వాటిని ఒక గ్లాస్ నీటిలో. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories