పట్టుచీరలు ఎప్పటికీ కొత్తగా మెరుస్తుండాలా? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎన్నేళ్లైనా కొత్తవాటిలా కనిపిస్తాయి

పట్టుచీరలు ఎప్పటికీ కొత్తగా మెరుస్తుండాలా? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎన్నేళ్లైనా కొత్తవాటిలా కనిపిస్తాయి
x

పట్టుచీరలు ఎప్పటికీ కొత్తగా మెరుస్తుండాలా? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎన్నేళ్లైనా కొత్తవాటిలా కనిపిస్తాయి

Highlights

పండుగలైనా, ఫంక్షన్లైనా ఎక్కువ మంది మహిళలు పట్టుచీరలనే ఎంచుకుంటారు. కానీ ఒకసారి వేసుకున్నాక వీటిని బీరువాలో దాచేస్తారు. దీంతో కొద్ది రోజుల్లోనే అవి పాత చీరల్లా కనిపించడం మొదలవుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే పట్టుచీరలు ఎన్నేళ్లైనా కొత్తగానే మెరుస్తుంటాయి.

పట్టు చీరలంటే మహిళలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎన్ని కొత్త వెరైటీ చీరలు వచ్చినా, గ్రాండ్‌గా కనిపించాలంటే మహిళలు పట్టుచీరలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మార్కెట్లో కంచి, ధర్మవరం, బ్రోకేట్ వంటి అనేక రకాల మోడల్స్, డిజైన్స్ లభ్యమవుతాయి. కానీ వీటిని ఎక్కువ కాలం బీరువాలో ఉంచడం వల్ల పట్టు కాంతి తగ్గిపోతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన సంరక్షణ పద్ధతులు పాటించడం అవసరం.

పట్టుచీరలను ఎల్లప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంచితే రంగు వెలిసిపోవచ్చు. ఎండ తగలకుండా, తడి ఎక్కువగా లేని ప్రదేశంలో స్టోర్ చేయడం మంచిది. చీరలన్నింటినీ ఒకేసారి ఒకే ప్యాక్‌లో ఉంచకూడదు. వేర్వేరుగా లేదా చిన్న కాటన్ బ్యాగ్‌లలో పెట్టాలి. దీని వల్ల ఒక చీరలోని జరీ వర్క్ మరొక చీరను దెబ్బతీయదు.

మడతలు సరిగా పెట్టడం చాలా ముఖ్యం. చీరలను మస్లిన్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి ఉంచితే పట్టు రక్షితం అవుతుంది. జరీ వర్క్ ఎక్కువగా ఉన్న చీరలను వేలాడదీయకండి, బరువుతో అవి సాగిపోతాయి. చీరలను ఒకే మడతలో ఎక్కువ కాలం ఉంచకూడదు. ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి తీసి కొత్తగా మడతపెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లలో స్టోర్ చేయకండి, తేమ బంధించబడటం వల్ల పట్టు దెబ్బతింటుంది.

పట్టుచీరలకు పురుగులు రాకుండా వేపాకులు, లావెండర్ సాచెట్స్ వంటి సహజ పద్ధతులు వాడండి. నాఫ్తలీన్ బాల్స్ వాడకపోవడం మంచిది. చీరలను అప్పుడప్పుడు బయటకు తీసి దులిపి, గాలిలో ఉంచితే దుర్వాసన పోతుంది, క్రిమికీటకాలు చనిపోతాయి. మరకలు పడితే డ్రైక్లీన్ చేయడం ఉత్తమం. ఇలా సంరక్షిస్తే పట్టుచీరలు ఎప్పటికీ కొత్తగానే మెరుస్తూ ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories