వేసవిలో అధిక సమయం ఏసీ గదుల్లో గడిపేస్తున్నారా...తస్మాత్ జాగ్రత్త

వేసవిలో అధిక సమయం ఏసీ గదుల్లో గడిపేస్తున్నారా...తస్మాత్ జాగ్రత్త
x
Highlights

ప్రస్తుతం బస్సుల్లో, ఇంట్లో, షాపింగ్ మాల్స్ లోనూ, థియేటర్లలోనూ ఏసీ లు ఉంటున్నాయి. అంతేకాదు ఆఫీసుల్లోనూ ఏసీ ఉంటుంది. ఇలా ఏసీలలో పనిచేవాళ్లు చాలా...

ప్రస్తుతం బస్సుల్లో, ఇంట్లో, షాపింగ్ మాల్స్ లోనూ, థియేటర్లలోనూ ఏసీ లు ఉంటున్నాయి. అంతేకాదు ఆఫీసుల్లోనూ ఏసీ ఉంటుంది. ఇలా ఏసీలలో పనిచేవాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఆ చల్లని వాతావరణానికి ఎడిక్ట్ అవుతున్నారు...వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు..కానీ.. ఏసీ నివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామందికి తెలియవు..తెలిస్తే మట్టుకు వాటి జోలికి వెళ్లనే వెల్లరు..

ఎక్కువగా ఏసీ గదిలో గడిపే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఎవరైతే.. AC గదిలో గడుపుతారో వాళ్లకు సైనస్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఏసీ ని తక్కువ టెంపరేచర్ లో పెట్టిన వెంటనే శరీరంలో ఎక్కువ హీట్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల బాగా అలసిపోతూ ఉంటారు. ఏసీ లో ఎక్కువగా గడిపేవారికి చర్మం పొడిగా మారుతుంది. ఆర్టిఫిషియల్ గా వాతావరణాన్ని చల్ల బరుచుకోవడం వల్ల చర్మ కణాలు డ్రైగా మారతాయి. దీనివల్ల డ్రై, రఫ్ స్కిన్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏసీ గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది విపరీతమైన దాహం అవుతుంది. ఏసీ గదుల్లో ఎక్కువగా గడిపే వారికి ఎక్కువగా తలనొప్పి వస్తుంది. అంతేకాదు మైగ్రేన్ కి కూడా దారి తీయవచ్చు. ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల.. స్వచ్ఛమైన గాలి అందక.. వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories