Sravana Masam 2024: నేడు మొదటి శ్రావణ సోమవారం...శివాలయాలకు పోటెత్తిన భక్తజనం


Shravan maasam 2024: నేడు మొదటి శ్రావణ సోమవారం..శివయ్య అనుగ్రహం కోసం ఈ మంత్రాలు పఠించండి
Sravana Masam 2024: పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టం అయిందో, శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో సోమవారం మరింత ప్రీతికరం. ఇవాళ శ్రావణ తొలి సోమవారం కాబట్టి..ఈ రోజు జలరూపంలో ఉన్న శివుడికి పూజ చేస్తే..ఓం భవాయ జల మూర్తయే నమ:అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.
Shravan maasam 2024: పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టం అయిందో, శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో సోమవారం మరింత ప్రీతికరం. ఇవాళ శ్రావణ తొలి సోమవారం కాబట్టి..ఈ రోజు జలరూపంలో ఉన్న శివుడికి పూజ చేస్తే..ఓం భవాయ జల మూర్తయే నమ:అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.
ఇవాళ పరమేశ్వరుడికి పూజ చేస్తే..కొన్ని రకాల పువ్వులను పూజలో ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా మందారపువ్వు, జిల్లేడుపువ్వు, గన్నేరుపూలతో పూజ చేయాలి. గన్నేరు పూలతో పూజ చేస్తే 1000 గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. లింగ పురాణంలో పరమ శివుడికి నిమ్మకాయలు, దానిమ్మపండ్లు, నేరేడుపండ్లు, అరటిపండ్లు, పనస పండ్లు, జామకాయలతో అభిషేకం చేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడని పండితులు తెలిపారు. నేడు శివనక్త వ్రతం ప్రారంభం కాబట్టి..ఈ వ్రతాన్ని పాటించేవారు..పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలని..ఆ తర్వాత దాన్ని తినాలని పండితులు చెబుతున్నారు. తద్వారా శివుడి అనుగ్రహం పొందుతారని చెబుతున్నారు.
శ్రావణ మాసంలో మహామృత్యుంజయ మంత్రం పఠించడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని శివపురాణంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు అకాల మరణ భయం నుండి విముక్తి పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అన్ని ప్రాపంచిక బాధల నుండి విముక్తి పొందుతారు. శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారి అనారోగ్య సమస్యలు తొలగిపోవడంతో పాటు కష్టాల నుంచి బయటపడతారు.
శ్రావణ మాసంలో ప్రతిరోజూ శివతాండవ స్తోత్ర పారాయణం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. శివుడు మీ కోరికలన్నింటినీ తీర్చగలడు. శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ కెరీర్‌లో విశేష ప్రయోజనాలు లభిస్తాయని...విశేష విజయాలు సాధిస్తారని నమ్ముతారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



