తిన్న వెంటనే వ్యాయామం చేస్తున్నారా..!

తిన్న వెంటనే వ్యాయామం చేస్తున్నారా..!
x
Highlights

తిన్న వెంటనే కొంత మంది వ్యాయామం చేస్తారు. అయితే అలా చేస్తే ఆశించిన ఫలితాలు రావడం కష్టం అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్నం భోజనం...

తిన్న వెంటనే కొంత మంది వ్యాయామం చేస్తారు. అయితే అలా చేస్తే ఆశించిన ఫలితాలు రావడం కష్టం అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్నం భోజనం చేశాక వెంటనే వ్యాయామం వద్దుంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే, తినడానికి, వ్యాయామానికి మధ్య కనీసం గంట నుంచి గంటన్నర విరామం ఉండాలట. ఎందుకంటే, ఆహారం తీసుకున్నప్పుడు రక్తప్రసరణ మన పొట్టవైపు ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మనం శరీరంలో ఏ భాగంతో వ్యాయామం చేస్తున్నామో ఆ భాగం వైపు రక్తం ఎక్కువగా ప్రసరిస్తుంది. అంటే చేతులు, కాళ్లు, ఛాతీ... ఇలా ఏ భాగంతో వ్యాయామం చేస్తే ఆ భాగంవైపు జరుగుతుందిని చెబుతున్నారు నిపుణులు.

తినడానికి, వ్యాయామానికి మధ్యలో తగిన విరామం లేకపోతే వ్యాయామం సరిగ్గా చేయలేం.. తిన్నదీ సరిగ్గా అరగదు. అందుకే ఈ రెండింటికీ మధ్య గంట నుంచి గంటన్నర మధ్య గ్యాప్ ఉండాలంటున్నారు. ఒకవేళ అరటిపండులాంటివి అల్పాహారంగా తీసుకుంటే.. వ్యాయామం చేయడానికి కనీసం 10-15 నిమిషాలునాలు గ్యాప్ ఉండాలంటున్నారు నిపుణులు. వ్యాయామం పూర్తైన తరువాత ఓ అరటిపండు, చపాతీ లాంటివి తింటే అలసట తగ్గే అవకాశం ఉందట. వ్యాయామం సరైన ఫలితాలివ్వాలంటే.. వ్యాయమానికి ముందు.. తర్వాత తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories