Top
logo

తినేటప్పుడు నీరు తాగితే మంచిదే.. కానీ..

తినేటప్పుడు నీరు తాగితే మంచిదే.. కానీ..
X
Highlights

చాలామంది తినేటప్పుడు నీరు తాగుతుంటారు. ముద్ద ముద్దకి వాటర్ తాగేవారు ఉన్నారు. వీడు తినేది తక్కువ.. తాగేది...

చాలామంది తినేటప్పుడు నీరు తాగుతుంటారు. ముద్ద ముద్దకి వాటర్ తాగేవారు ఉన్నారు. వీడు తినేది తక్కువ.. తాగేది ఎక్కువ అని అమ్మ చీవాట్లు పెట్టినా.. పట్టించుకోకుండా గడగడ నీళ్లు తాగేవాళ్లు ఉన్నారు. తినేటప్పుడు తాగొద్దు.. మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఇంతకీ తినేటప్పుడు వాటర్ తాగితే ఏమౌతుంది? అసలు తినే సమయంలో వాటర్ తాగకూడదా.. అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. తినేటప్పుడు వాటర్ తాగితే మంచిదే..! కానీ ఎక్కువగా తాగొద్దు అంటున్నారు నిపుణులు. తగిన మోతాదులో నీళ్లు తాగొచ్చు అంటున్నారు.

తినేటప్పుడు ఎక్కువగా నీరు తీసుకుంటే.. దీనివల్ల జీర్ణక్రియ పనితీరు తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం సమయంలో ఎక్కువనీరు తీసుకోవద్దని చెబుతారు. కాబట్టి.. తినే ముందు కానీ, తిన్న అరగంట తరువాత కానీ నీరు తాగాలి. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తీసుకోవాలి.

ఒంట్లో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడే నీరు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. కాబట్టి తినే సమయంలోనే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండాలి. తినేసమయంలో మాత్రం తక్కువగా నీరు తాగాలి. ఇక భోజనం మరీ స్పైసీగా ఉంటే.. నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి.. అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి. సో.. తినే సమయంలో మరి ఎక్కువగా వాటర్ తీసుకోకుండా.. తగిన మోతాదులో తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Next Story