పిల్లల దండన వద్దు!

పిల్లల దండన వద్దు!
x
Highlights

పిల్లలు అన్నాక అల్లరి సర్వ సాధారణం దానికే వారిపై కోపం తెచ్చుకుని దండించడం తల్లిదండ్రులకు సాధారణం అయిపోయింది. పిల్లలు నేరస్తులు కాదు. వాళ్ళను...

పిల్లలు అన్నాక అల్లరి సర్వ సాధారణం దానికే వారిపై కోపం తెచ్చుకుని దండించడం తల్లిదండ్రులకు సాధారణం అయిపోయింది. పిల్లలు నేరస్తులు కాదు. వాళ్ళను చిన్నప్పటి నుంచే సరైనా దారిలో పెట్టడానికి పిల్లల పట్ల కఠినంగా ప్రవరిస్తుంటారు. కానీ అది మంచిది కాదని అలా చేయడం వల్ల వారు మరకపోగా మానసిక స్థితిపైన వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. . కొన్నిసార్లు ఇతరులపై కోపంతో, లేదా విపరీతమయిన ఒత్తిడితో పిల్లలను దండిస్తారు.

వారిపై కోపంతో కాకుండా అమ్మానాన్నలే తోడూనీడగా ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు. పిల్లల అభిరుచుల్ని, మేధాశక్తిని, గుర్తించాలి. పిల్లలు అల్లరికి చేయడం కామన్. అల్లరి శృతిమించకూడదని వారిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఇది సరికాదంటారు మనో వైజ్ఞానికులు. శిక్షలు కొత్త సమస్యలను సృష్టిస్తాయని పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో వారి వయసును, అభిరుచులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పరిశోధకులు. 6 నుంచి 13 ఏళ్ళ మధ్య వయస్సు చాలా సున్నితమైనది. ఆ వయస్సులో శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా వారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వారి అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా స్వేచ్ఛగా వ్యవహరించాలన్న కోరిక, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో కనిపిస్తాయి. అలాంటి సమయంలో అమ్మానాన్నలే పిల్లలకు తోడూనీడగా ఉండాలని మనో వైజ్ఞానికులు అంటున్నారు. కోపంతో కాకుండా, ప్రేమతో చెప్పడం లేదంటే సున్నితంగా మందలించడం చేయలని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories