గొర్రెలకు స్కూల్ అడ్మిషన్ అంట..

గొర్రెలకు స్కూల్ అడ్మిషన్ అంట..
x
Highlights

స్టూడెంట్స్ సంఖ్య తక్కువగా ఉంటే స్కూల్ మూసివేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించడం తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు జరిగింది. స్కూల్ మూసివేయవద్దని...

స్టూడెంట్స్ సంఖ్య తక్కువగా ఉంటే స్కూల్ మూసివేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించడం తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు జరిగింది. స్కూల్ మూసివేయవద్దని విద్యార్థులు, తలిదండ్రులు నిరసనలు, ఆందోళనలు చేయటం.. కొన్ని పాఠశాలలను ప్రభుత్వాలు మూసేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఫ్రాన్స్‌లోనూ జరిగింది.

ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని క్రెట్స్ ఎన్ బెల్లెడొన్నే అనే పట్టణంలోని కళాశాలలో 11వ తరగతిలో 226 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే ఇటీవల 15 మంది పిల్లలు స్కూల్ మానేశారు. దీంతో అక్కడి స్కూల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గింది. ఇదే సాకుగా చూపించి అక్కడి అధికారులు 11 వ తరగతిని ఎత్తివేస్తామని తేల్చి చెప్పారు. దీంతో స్కూల్ మూసివేయవద్దని విద్యార్థులు, తలిదండ్రులు నిరసనలు, ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైఖేల్ గిరెర్డ్ అనే స్థానిక రైతు నిరసన వ్యక్తం చేస్తూ.. తన 15 గొర్రెలను తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించాడు. వాటికి బా-బెటె, డాల్లీ, షావున్ వంటి పేర్లు పెట్టి స్కూలు రికార్డుల్లో నమోదు చేయించాడు. ఈ గొర్రెల అడ్మిషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దానికి 200 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు స్థానిక మేయర్ కూడా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ గొర్రెలకు జనన ధ్రువీకరణ పత్రాలు కూడా ఇచ్చి మేయర్ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను, సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విద్యార్థుల సంఖ్యను సాకుగా చూపించి తరగతులను ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదాన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మందను తోలుకొచ్చి 'మేం గొర్రెలం కాదు' అంటూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినదించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories