Shaving Tips: షేవింగ్ సమయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

Shaving Tips
x

Shaving Tips: షేవింగ్ సమయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

Highlights

Shaving Tips: పురుషులలో చాలా మందికి షేవింగ్ అనేది దైనందిన జీవితంలో విడదీయలేని భాగం. రోజూ క్లిన్ షేవ్ చేస్తారు కొందరు. మరికొందరు వారానికి ఒకసారి షేవ్ చేయడం ఇష్టపడతారు.

Shaving Tips: పురుషులలో చాలా మందికి షేవింగ్ అనేది దైనందిన జీవితంలో విడదీయలేని భాగం. రోజూ క్లిన్ షేవ్ చేస్తారు కొందరు. మరికొందరు వారానికి ఒకసారి షేవ్ చేయడం ఇష్టపడతారు. అయితే, షేవింగ్ సమయంలో కొన్ని చిన్నచిన్న తప్పులు చేయడం వల్ల చర్మానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్, రషెస్, పొడితనంతో పాటు ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 5 ప్రధాన తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు.

1. ముఖం కడుక్కోకుండా షేవింగ్ చేయడం

చాలామంది తొందరపడి ముఖాన్ని శుభ్రం చేయకుండా షేవింగ్ మొదలు పెడతారు. అయితే ముఖంపై ఉండే మురికి, ధూళి, బ్యాక్టీరియా షేవింగ్ బ్లేడ్ ద్వారా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి. కాబట్టి షేవింగ్ ముందు గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం, ఫేస్ వాష్ ఉపయోగించడం తప్పనిసరి.

2. ఒకే రేజర్‌ను పదే పదే వాడడం

పాత రేజర్‌ను తిరిగి తిరిగి వాడటం వల్ల బ్లేడ్ మొనదేలిపోతుంది. ఇది చర్మంపై గాయాలు, చర్మం చిట్లేలా చేస్తుంది. అంతేకాదు, పాత రేజర్లలో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్‌కు అవకాశం ఉంటుంది. కనీసం ప్రతి 4–5 షేవింగ్‌ల తర్వాత బ్లేడ్ మార్చడం మంచిది.

3. లూబ్రికేషన్ లేకుండా షేవింగ్ (డ్రై షేవింగ్)

షేవింగ్ ఫోమ్ లేకుండా డైరెక్ట్ షేవింగ్ చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇది రేద్డినెస్‌, దద్దుర్లు, చర్మంపై కోతలుగా మారవచ్చు. కాబట్టి ఎప్పుడూ షేవింగ్ ఫోమ్, జెల్ లేదా క్రీమ్ వాడటం అలవాటు చేసుకోండి. బ్లేడ్ చర్మంపై సాఫీగా కదలడానికి ఇది సహాయపడుతుంది.

4. షేవింగ్ తర్వాత మాయిశ్చరైజ్ చేయకపోవడం

షేవింగ్ అనంతరం చర్మం తడిసిపోయి, పొడిబారినట్టుగా మారుతుంది. ఈ సమయంలో మాయిశ్చరైజర్ లేకుండా వదిలేస్తే చర్మం చిట్లిపోయే అవకాశం ఉంటుంది. షేవింగ్ తర్వాత ఆల్కహాల్ లేని ఆఫ్టర్‌షేవ్ బామ్ లేదా లైట్ మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి.

5. చర్మానికి తగ్గ షేవింగ్ పద్ధతి పాటించకపోవడం

ఒక్కొక్కరి చర్మం ఒక్కోరకంగా ఉంటుంది. సున్నితమైన చర్మం ఉంటే డబుల్ పాస్ షేవింగ్ (రెండుసార్లు గీయడం) నివారించాలి. బ్లేడ్ వేగంగా నడిపించడం కాకుండా మృదువుగా, దిశగా షేవ్ చేయాలి. ఇవన్నీ పాటిస్తే చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories