Seema Chintakaya: ఈ కాయలు కనిపించగానే తినాల్సిందే.. ఆ రోగాలని కూకటి వేళ్ళతో తొలగిస్తుంది

Seema Chintakaya
x

Seema Chintakaya: ఈ కాయలు కనిపించగానే తినాల్సిందే.. ఆ రోగాలని కూకటి వేళ్ళతో తొలగిస్తుంది

Highlights

Seema Chintakaya Benefits: సీమ చింతకాయ కేవలం సీజన్లో మాత్రమే కనిపించే ఈ చింతకాయ. ఇది తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Seema Chintakaya Benefits: సాధారణంగా కేవలం గ్రామాల వారికి మాత్రమే పరిచయం ఉండే ఈ సీమ చింతకాయ ప్రస్తుతం సిటీల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ సీజన్లో మాత్రమే దొరికే సీమ చింతకాయ దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఈ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధానంగా ఇందులో మెగ్నీషియం ఉంటుంది. డయాబెటిస్ వారికి ఇది ఎంతో మంచిది అని చెప్పొచ్చు. అంతేకాదు కొన్ని రకాల జబ్బులను కూడా సీమ చింతకాయ దూరం చేస్తుంది.

సీమ చింతకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఈ చింతకాయ అమృతంతో సమానమని పిలుస్తారు. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. నోట్లో వేసుకోగానే తీయతీయ‌గా.. పుల్లపుల్లగా కరిగిపోయే ఈ పండును తీసుకుంటే డయాబెటిస్ వారికి కూడా మేలు చేస్తుంది.

ప్ర‌ధానంగా సీమ చింత‌కాయ‌లో యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉంటుంది. తద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా ఎంచక్కా ఈ సీమ‌ చింతకాయలను తినవచ్చు. అంతే కాదు ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది. తద్వారా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సీమ చింతకాయ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. తద్వారా సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా సీమ చింతకాయ ఎంతో బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కాయ‌ల్లో ఐర‌న్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories