Urinary Problems: మూత్ర సమస్యలకు పరిష్కారం.. కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే ఈ కూరగాయను తినండి!

Urinary Problems: మూత్ర సమస్యలకు పరిష్కారం.. కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే ఈ కూరగాయను తినండి!
x

Urinary Problems: మూత్ర సమస్యలకు పరిష్కారం.. కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే ఈ కూరగాయను తినండి!

Highlights

Urinary Problems: ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పాలంటే దోసకాయ మన శరీరానికి చాలా మంచిది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే.

Urinary Problems: ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పాలంటే దోసకాయ మన శరీరానికి చాలా మంచిది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. వైద్యులు కూడా దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తుంటారు. దోసకాయను సలాడ్‌గా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె , పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఫిసెటిన్ వంటి పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారికి మంచిది

డయాబెటిస్​తో బాధపడేవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యలతో బాధపడుతుంటారు. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్ వస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరం నుంచి విషాన్ని తొలగించేందుకు సహాయం

మీరు రోజూ దోసకాయ తినే అలవాటు ఉంటే, దాన్ని మధ్యాహ్నం కంటే ముందే తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దోసకాయలో 95% నీరు ఉంటుంది. ఇది శరీరం నుంచి విషపూరిత పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

మలబద్ధకం నుంచి విముక్తి

దోసకాయలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. రాత్రిపూట దోసకాయ తినకపోవడానికి ప్రధాన కారణం అందులో ఉండే జిగట పదార్థం. మధ్యాహ్నం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది. అందుకే మధ్యాహ్నం కంటే ముందే దీన్ని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా, రాత్రి సమయంలో దోసకాయ తింటే అందులో ఉన్న ఫైబర్​ను జీర్ణం చేసుకోవడం కష్టం అవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.

కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది

ఎక్కువసేపు నీరు తాగడం మరచిపోయినప్పుడు, ఈ దోసకాయ శరీరంలో నీటి కొరతను తీర్చడానికి సహాయపడుతుంది. అలాగే, చర్మ అలర్జీలు, ఎండ వల్ల వచ్చే దద్దుర్లను నివారిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు దోసకాయ తినడం చాలా మంచిది. అంతేకాకుండా, ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దోసకాయ తినడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్లి, శరీర వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. దోసకాయ రసాన్ని తాగడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories