Salad Benefits: అన్నం తినేముందు సలాడ్ ఎందుకు తినాలి? తింటే లాభాలేంటి?

Salad Benefits
x

Salad Benefits: అన్నం తినేముందు సలాడ్ ఎందుకు తినాలి? తింటే లాభాలేంటి?

Highlights

Salad Benefits: లంచ్, డిన్నర్ తినే ముందు సలాడ్ తీసుకుంటే మంచిదని చాలామంది న్యూట్రిషియన్లు చెబుతుంటారు. అంతేకాదు కొంతమంది పేషెంట్లను చూసినా, డైట్ ఫాలో అయ్యేవారైనా కూడా సలాడ్‌ని బాగా ఇష్టంగా తింటుంటారు.

Salad Benefits: లంచ్, డిన్నర్ తినే ముందు సలాడ్ తీసుకుంటే మంచిదని చాలామంది న్యూట్రిషియన్లు చెబుతుంటారు. అంతేకాదు కొంతమంది పేషెంట్లను చూసినా, డైట్ ఫాలో అయ్యేవారైనా కూడా సలాడ్‌ని బాగా ఇష్టంగా తింటుంటారు. ఇంతకీ సలాడ్ అన్నం తినేముందు ఎందుకు తినాలి. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

సలాడ్. రంగురంగుల్లో కూరగాయలు, పండ్లు ముక్కలు కనిపిస్తాయి. చూస్తుంటేనే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అయితే అన్నం తినేముందు సలాడ్‌ని ఎందుకు తినాలంటే వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి బొలెడన్న పోషకాలు అందిస్తాయి.

సాధారణంగా సలాడ్‌లో ఉల్లిపాయ, క్యారెట్, బీట్ రూట్, కీర, ముల్లంగి, బ్రోకలీ, క్యాప్సికమ్, కొత్తమిరతో పాటు ఉప్ప, పెప్పర్, నిమ్మరసం, పింక్ సాల్ట్ ని చల్లుకుని తింటారు. ఇవన్నీ కూడా శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. అందుకే డాక్టర్లు అన్నం తినేముందు ఇవి తింటే మంచిదని చెబుతుంటారు.

సలాడ్ తినడం వల్ల అన్నీ ప్రయోజనాలే..

ప్రతిరోజు సలాడ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ ఎ, సి, ఫోలేట్, పొటాషియం వంటి అనేక పోషకాలు నేరుగా శరీరానికి అంది.. శక్తిని అందిస్తాయి. వీటితో పాటు కొన్ని మొలకలు కలుపుకుంటే ఐరన్, ఫైబర్ వంటివి కూడా శరీరానికి అందుతాయి. ఇలా రోజూ తినడం వల్ల శారీరక అభివృద్ధితో పాటు రక్తం ప్యూరిఫై అవ్వడం, శరీర బలం పెరగడం, చర్మం తేజస్సుగా ఉండటం వంటి లాభాలు పొందవచ్చు.

బరుకు తగ్గాలంటే..

బరువు తగ్గాలి.. పోషకాలు ఎక్కువగా పొందాలి అనుకునేవారు సలాడ్‌ని విరివిగా తినాలి. ఎందుకంటే ఒకేసారి కూరగాయలు అన్నింటిని తినడం వల్ల శరీరంలోకి ఒకేసారి పుష్కలంగా పోషకాలు అందుతాయి. దానికితోడు భోజనానిని ముందు తినడం వల్ల ఈ పోషకాలు నేరుగా శరీరానికి పడతాయి.

రక్తహీనత తగ్గించాలంటే

క్యారెట్, బీట్ రూట్ వంటి కాయగూరలు ఉండే సలాడ్ తింటే రక్తహీనత తగ్గుతుంది. రోజూ సలాడ్ తింటే నెలరోజుల్లో రక్తంలో మార్పులను మనం గమనించవచ్చు.

మానసిక ఉల్లాసంగా..

సలాడ్‌ తినడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అన్ని పోషకాలు శరీరానికి అందడం వల్ల అలసట ఉండదు. దీంతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories