Top
logo

కుంకుమను నుదుటి మీదే పెట్టుకోవడానికి కారణం అదేనా..!

కుంకుమను నుదుటి మీదే పెట్టుకోవడానికి కారణం అదేనా..!
X
Highlights

కుంకుమ బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయం. మహిళలు తప్పనిసరిగా నుదుటి మీద ఈ బొట్టును రోజూ పెట్టుకుంటారు. ఇక...

కుంకుమ బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయం. మహిళలు తప్పనిసరిగా నుదుటి మీద ఈ బొట్టును రోజూ పెట్టుకుంటారు. ఇక ఆలయానికి వెళ్తే కుంకుమబొట్టు తప్పనిసరి. కుంకుమను నుదుటి మీద పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. మనిషి శరీరంలో మొత్తం 7 చక్రాలు ఉంటాయని భారతీయ తత్వశాస్త్రం చెబుతోంది.

వెన్నుపూస చివరన మూలాధార చక్రంతో మెదలై తలపైన సహస్రాధార చక్రంతో అంతమవుతాయి. కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం 6వ చక్రంగా చెబుతారు. దీనినే మూడో నేత్రం అంటారు. ఈ నేత్రం ద్వారా దేవుడిని దర్శించవచ్చని కొందరు నమ్ముతారు. అందుకే కనుబొమ్మల మధ్య ఉండే మూడో నేత్రం మీద కుంకుమని పెట్టుకుంటారు.

నుదుటి మీద కుంకుమను పెట్టుకోవడం గౌరవసూచకంగా, దైనానుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. కుంకుమను పెద్దవారికి పెడితే గౌరవంగా, చిన్నవారికి పెడితే దీవెనగా అనుకుంటారు. ఎలా తయారు చేస్తారో తెలుసా! కుంకుమను పసుపు తయారు చేస్తారు. కాకపోతే రకరకాల పద్దతుల్లో పసుపును ఉపయోగించి కుంకుమను తయారు చేస్తారు.

కుంకుమ తయారీలో నిమ్మరసం, పసుపు కొమ్ములు, కర్పూరం ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల సున్నపు నీరు, పసుపు కొమ్ములు, నిమ్మరసం ఉపయోగించి తయారు చేస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో కుంకుమ రాళ్లు, పసుపు కొమ్ములు కలిపి కుంకుమను సిద్ధం చేస్తారు. మనదేశంలో కుంకుమ తయారీ అనేది ఓ చిన్న కుటీర పరిశ్రమ.

పెద్ద సంస్థలు దీనిని తయారుచేసినా.. చిన్న సంస్థలు కూడా దానితో పోటీ పడుతున్నాయి. ఇళ్లతో పాటు దేవాలయాల్లోనూ, పూజల్లోనూ కుంకుమను వాడుతారు. దైవానుగ్రహానికి గుర్తుగా కుంకుమను చూడడం భారతీయుల సంప్రదాయం.

Next Story