వాసన చూస్తే చాలు.. ఆకలి మాయం!

వాసన చూస్తే చాలు..  ఆకలి మాయం!
x
Highlights

వాసన చూస్తే ఆకలి ఎలా మాయమవుతుంది.. తింటే కదా.. ఆకలి తీరేది అనుకుంటున్నారా..! ఓ సినిమాలో పిసినారి.. కోడిని కట్టేసి.. అదిగో కోడి.. ఇదిగో అన్నం.. కోడిని...

వాసన చూస్తే ఆకలి ఎలా మాయమవుతుంది.. తింటే కదా.. ఆకలి తీరేది అనుకుంటున్నారా..! ఓ సినిమాలో పిసినారి.. కోడిని కట్టేసి.. అదిగో కోడి.. ఇదిగో అన్నం.. కోడిని చూస్తూ తినూ.. అనే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశంలో హాస్యం బాగా పండింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే నిజ జీవితంలోనూ వచ్చింది. ఇష్టమైన ఆహారం కంటికి కనిపిస్తే.. నోరూరుతుంది. దాన్ని ఓ పట్టు పట్టేంత వరకు మనసు ఊరుకోదు. కానీ స్లిమ్ గా కనబడాలని.. ఆరోగ్యంగా ఉండాలని ఇష్టమైన ఆహారాన్ని తినకుండా నోరు నొక్కేసుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఎంత కంట్రోలు చేసుకున్న.. నచ్చిన ఫుడ్ కనబడితే ఒక్కసారి తింటే ఏం కాదులే అని సర్ది చెప్పేసి లాగించే వాళ్లు ఉన్నారు. మరుసటి రోజు అయ్యో తిన్నామని బాధపడుతుంటారు. ఇది చాలామందికి పెద్ద సమస్యలా మారింది.

అయితే దీనికి ఓ చక్కటి పరిష్కారం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తినకూడని వాటిని కూడా తిన్నామనే సంతృప్తిని పొందవచ్చని చెబుతున్నారు. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినాలనుకుంటే.. ముందు ఆ పుడ్ వాసన చూసి.. ఆస్వాదించమంటున్నారు పరిశోధకులు.

నచ్చిన ఫుడ్ పిజ్జా, బిర్యానీ, బర్గర్ వంటి కేలరీలు ఉన్నవాటిని 2 నిమిషాలు వాసన చూస్తే.. తిన్నామనే సంతృప్తి కలుగుతుందట. తర్వాత తినే ఆహారం తక్కువగా తింటారని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఆహార పదార్థాల సువాసన వల్ల పూర్తి సంతృప్తి అనిపించి కడుపు నిండినట్టు అనిపించడమే దీనికి కారణం అని వెల్లడించారు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories