Beauty Tips: అల్లంతో ముఖంపై ముడతలు తొలగించండి.. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ..!

Remove Wrinkles on the Face with Ginger Less Cost More Results
x

Beauty Tips: అల్లంతో ముఖంపై ముడతలు తొలగించండి.. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ..!

Highlights

Beauty Tips: ఈ రోజుల్లో ముఖంపై ముడతలతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి మార్కెట్‌లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు.

Beauty Tips: ఈ రోజుల్లో ముఖంపై ముడతలతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి మార్కెట్‌లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు. అయినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. అందుకే ముఖంపై ముడతలు తొలగించుకోవడానికి ఇంట్లోనే అద్భుతమైన వస్తువు ఉంది. దీని ఖర్చుతక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుది. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అల్లం ముఖంపై ముడతలని తొలగిస్తుంది. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

అల్లం అనేది ఆహార రుచిని మెరుగుపరుస్తుంది. అందుకే వంటలలో విరివిగా వాడుతారు. అంతేకాకుండా టీ తయారీలో కూడా ఉపయోగిస్తారు. అల్లం చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి అల్లంను ముఖంపై ఉపయోగించడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి. దీంతోపాటు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తాయి. చర్మం సహజమైన కాంతిని పొందుతుంది. అయితే అల్లం ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

అల్లం ఫేస్ మాస్క్ తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో

1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లం పొడి, 2 టీస్పూన్ తేనె కలపాలి. తరువాత అవసరం మేరకు రోజ్ వాటర్ కలపాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖంపై అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత ముఖంపై బాగా అప్లై చేయాలి. సుమారు 15 నిమిషాలు అప్లై చేస్తే నెమ్మదిగా మర్దన చేయాలి. తర్వాత కొద్దిసేపు వదిలేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖంపై అద్భుతమైన మెరుపుని చూస్తారు. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories