White Clothes: తెల్ల బట్టలపై మరకలు? ఈ సింపుల్ హోం టిప్స్‌తో క్షణాల్లో మాయం!

White Clothes: తెల్ల బట్టలపై మరకలు? ఈ సింపుల్ హోం టిప్స్‌తో క్షణాల్లో మాయం!
x

White Clothes: తెల్ల బట్టలపై మరకలు? ఈ సింపుల్ హోం టిప్స్‌తో క్షణాల్లో మాయం!

Highlights

తెల్లటి బట్టలపై మరకలు పడటం చాలా సాధారణమైన విషయం. కానీ ఆ మరకలు తొలగించడం మాత్రం పెద్ద పని. ఎందుకంటే తెల్లటి బట్టలపై చిన్నదైనా మరకం స్పష్టంగా కనిపిస్తే అది చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

White Clothes : తెల్లటి బట్టలపై మరకలు పడటం చాలా సాధారణమైన విషయం. కానీ ఆ మరకలు తొలగించడం మాత్రం పెద్ద పని. ఎందుకంటే తెల్లటి బట్టలపై చిన్నదైనా మరకం స్పష్టంగా కనిపిస్తే అది చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అయితే ఇంట్లోనే దొరికే కొన్ని సాధారణ పదార్థాల ద్వారా మీరు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం పొందవచ్చు. వెనిగర్, నిమ్మరసం, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఉప్పు వంటి పదార్థాలు ఈ పని కోసం అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కేవలం మరకలను తొలగించడమే కాదు, బట్టల్ని మెరుస్తూ కొత్తలా కనిపించేలా చేస్తాయి.

చెమట మరకలు, టీ, కాఫీ, తుప్పు, వైన్ లేదా జిడ్డుగల మరకలు ఏవైనా కావొచ్చు, సరైన పద్ధతిలో త్వరగా స్పందిస్తే వాటిని పూర్తిగా తొలగించవచ్చు. ఇక దైనందిన జీవితంలో ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలు మీ తెల్లబట్టలపై ఉన్న మొండి మరకల్ని కూడా తేలికగా తొలగించగలవు.

తెల్లబట్టలపై మరకలు తొలగించడానికే కొన్ని చక్కని చిట్కాలు:

వెనిగర్‌ని నీటిలో కలిపి మరకలపై రాసి కొన్ని నిమిషాలు ఉంచడం ద్వారా చెమట, ధూళి వంటి సాధారణ మరకలు తొలగిపోతాయి. ఇది బట్టలను బ్లీచ్ చేయకుండానే మృదువుగా చేస్తుంది.

నిమ్మరసం సహజ బ్లీచ్‌లా పనిచేస్తూ తుప్పు, చెమట తదితర మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని మరకపై రాసి 30 నిమిషాల పాటు ఎండలో ఉంచి తర్వాత ఉతకాలి.

బేకింగ్ సోడా పేస్ట్‌ను తయారు చేసి మరకలపై అప్లై చేయడం ద్వారా టీ, కాఫీ, లేదా ఇతర జిడ్డుగల మరకలను తొలగించవచ్చు. ఇది ఫాబ్రిక్‌ను కొత్తలా మెరుస్తుంది.

3% హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను మొండి మరకలపై రాసి, 10 నిమిషాల తరువాత వాష్ చేయడం వల్ల రక్తం, మేకప్, చెమట వంటి మొండిమరకలు తొలగిపోతాయి.

రక్తం, గ్రీజు లేదా వైన్ మరకలపై ఉప్పునీరు వేసి 5-10 నిమిషాలు నానబెట్టి, చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల తడి మరకలు వ్యాపించకుండా ఆపచ్చు.

ఈ సులభమైన చిట్కాలతో మీరు మీ తెల్లటి బట్టలను కొత్తలా మెరుస్తూ, ఖరీదైన రసాయన క్లీనర్ల అవసరాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఇక మీ తెల్లబట్టలపై మళ్లీ మరకలకే జాగ్రత్త!

Show Full Article
Print Article
Next Story
More Stories