నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి..

నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
x
Highlights

నోటి దుర్వాసన.. చాల మందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ బ్రష్ చేసిన.. కొందరిలో నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు మరొకరితో మాట్లాడానికి...

నోటి దుర్వాసన.. చాల మందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ బ్రష్ చేసిన.. కొందరిలో నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు మరొకరితో మాట్లాడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. ఇకవేళ వీరు మాట్లాడుతున్న దుర్వాసన వల్ల ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నోట్లో నుంచి వెలువడే దుర్వాసన కారణంగా.. నలుగురిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేని పరిస్థితి రావచ్చు. పక్కనున్న వారితో దగ్గరగా కూర్చోని మాట్లాడాలన్నా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే.. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ నోరు పొడిగా మారకుండా జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. భోజనం తరువాత నోటిని పుక్కిలించాలి. అలా చేయడం వల్ల దంతాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారం బయటకు వస్తుంది.

అయితే నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. మధుమేహం, చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్ఫెక్షన్, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యల కారణంగా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిగుళ్లు, దంతాల వ్యాధుల కారణంగా నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోయినా, కొన్ని రకాల మందుల కారణంగా.. నోరు పొడిబాడి నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కారణం ఇదే అయితే .. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే రోజుకి 8 గ్లాసుల వాటర్ తాగటంతోపాటు దంతాలు, చిగుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న వెంటనే నీళ్లతో నోరు పుక్కిలించుకుంటూ ఉంటే నోటి దుర్వాసనకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories