Top
logo

శరీరానికే కాదు, మెదడుకు కూడా వ్యాయమం మంచిది

శరీరానికే కాదు, మెదడుకు కూడా వ్యాయమం మంచిది
X
Highlights

రోజు వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికే కాదు, మెదడుకు కూడా వ్యాయమం మంచిది. నడవటం, సైకిల్‌...

రోజు వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికే కాదు, మెదడుకు కూడా వ్యాయమం మంచిది. నడవటం, సైకిల్‌ తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలతో జ్ఞాపకశక్తి ఎంతగానో మెరుగుపడుతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మతిమరుపుతో సతమతమవుతున్న వారికి మరెంతో మేలు చేస్తుంది వ్యాయామాలను ఆరు నెలల పాటు చేసినా మెదడు వయసు సుమారు 9 సంవత్సరాలు తగ్గినంత సమానంగా ఫలితం ఉంటుంది. దీంతో ఏకాగ్రత, ప్రవర్తన అదుపులో ఉండి పనులు సక్రమంగా చేసుకోవటం వంటివి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక వ్యాయామాలకు పండ్లు, కూరగాయలు తినటం వల్ల మెదడు పనితీరు మరింతగా పుంజుకుంటోంది.

రోజుకో గుడ్డు తింటే పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆరు నెలల పాటు ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు చొప్పున తినే పిల్లల మెదడు పనితీరును బాగుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, డీహెచ్‌ఏ వంటివి మెదడు ప‌నితీరును మెరుగుప‌ర్చ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు .అలాగే వాల్‌నట్స్‌ని తినడం వల్ల నాడీకణాల పనితీరుతో పాటు మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు మెదడు పనితీరు తగ్గకుండా చేస్తాయి. అందుకే రోజూ ఓ మూడు వాల్‌నట్స్‌ని తీసుకుంటే మంచిది.

Next Story