Lifestyle: ఈ తెల్లటి విషాన్ని మీరు కూడా తింటున్నారా.? జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Refined Flour Maida The Hidden Health Dangers
x

Lifestyle: ఈ తెల్లటి విషాన్ని మీరు కూడా తింటున్నారా.? జాగ్రత్తగా ఉండాల్సిందే..! 

Highlights

Refined Flour: మైదా అంటే రిఫైన్డ్ గోధుమ పిండి. దీన్ని ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా అంటారు. గోధుమ పిండిలోని తేమ, ఫైబర్‌ను పూర్తిగా తొలగించి దీనిని తయారు చేస్తారు.

Refined Flour: మైదా అంటే రిఫైన్డ్ గోధుమ పిండి. దీన్ని ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా అంటారు. గోధుమ పిండిలోని తేమ, ఫైబర్‌ను పూర్తిగా తొలగించి దీనిని తయారు చేస్తారు. సాధారణంగా బేకరీ ఐటమ్స్, బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, సమోసాలు లాంటి ఆహారాల్లో దీనిని ఉపయోగిస్తారు. ఈ పిండి శరీరానికి మేలు చేయడం కన్నా నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* మైదాలో ఫైబర్ లేకపోవడంతో ఇది తినగానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వల్ల గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు దారి తీసే అవ‌కాశాలు ఉంటాయి. షుగర్ ఉన్నవారు మైదా ఆధారిత ఆహారాలను తీసుకుంటే చాలా ప్ర‌మాద‌క‌రం.

* రిఫైనింగ్ ప్రక్రియలో మైదా పిండిలోని ముఖ్యమైన బి గ్రూప్ విటమిన్లు, ఐరన్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పూర్తిగా నశించిపోతాయి. దీంతో ఇది శరీరానికి అవసరమైన పోషణను ఇవ్వడం జరగదు.

* మైదా అధికంగా తీసుకున్నవారిలో శక్తి తక్కువగా అనిపించడం, అలసట, ఒత్తిడి పెరగడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

మైదాకు ప్రత్యామ్నాయంగా ఏమి తినాలి?

సహజ శక్తి, ఫైబర్‌తో కూడిన తాజా పండ్ల‌ను డైట్‌లో భాగం చేసుకోవాలి. అలాగే మంచి కొవ్వుల‌తో పాటు శ‌క్తి ఎక్కువ‌గా ఉండే సనఫ్లవర్, చియా, ఆల్సీ వంటి విత్తనాలను తీసుకోవాలి. బాదం, వాల్‌న‌ట్‌, కాజూ వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories