జ్యూస్‌లతో ఫ్యాట్‌కు చెక్‌

జ్యూస్‌లతో ఫ్యాట్‌కు చెక్‌
x
Highlights

అధిక బరువును తగ్గించడంలో వెజిటబుల్ జ్యూస్‌లు ఎంతో ఉపకరిస్తాయి. ఈ జ్యూస్‌లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ద్రాక్ష పళ్ల రసంలో విటమిన్...

అధిక బరువును తగ్గించడంలో వెజిటబుల్ జ్యూస్‌లు ఎంతో ఉపకరిస్తాయి. ఈ జ్యూస్‌లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ద్రాక్ష పళ్ల రసంలో విటమిన్ సితోపాటు ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఈ రసం తాగితే బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. గ్రీన్ టీ‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, మెటబాలిజంను పెంచే ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో చక్కెర కలపకుండా తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. నీరు కూడా బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కొబ్బరి నీరు శరీరంలోని మెటబాలిజం రేటును వృద్ధి చేస్తుంది. రోజుకు 1 నుంచి 2 గ్లాసుల కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అలాగే బరువును నియంత్రించడంలో బ్లాక్ కాఫీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories