నైట్ డ్యూటీ చేసేవారికే నాలెడ్జ్ ఎక్కువ

నైట్ డ్యూటీ చేసేవారికే నాలెడ్జ్ ఎక్కువ
x
Highlights

జీవితంలో విజయ శిఖరాలను అందుకున్న చాలా మంది వారు రాత్రి సమయాల్లోనే ఎక్కువగా కష్టపడతారని ఓ అధ్యయనంలో తేలింది. అందువల్ల రాత్రి వేళలే అనుకూలం అనుకుంటే ఆ...

జీవితంలో విజయ శిఖరాలను అందుకున్న చాలా మంది వారు రాత్రి సమయాల్లోనే ఎక్కువగా కష్టపడతారని ఓ అధ్యయనంలో తేలింది. అందువల్ల రాత్రి వేళలే అనుకూలం అనుకుంటే ఆ సమయంలోనే ఎక్కువ పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో పనిచేసేవారిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌కి చెందిన శాస్త్రవేత్త టోసీ కనజావా రాత్రిళ్ళు మేల్కొనే వారిపై పరిశోధనలు చేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం పూర్వకాలంలో రాత్రి వేళల్లో పనిచేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఉదయాన్నే మేల్కొని పనులు చేసుకునేవారు. ఈ అలవాటు తరాలుగా వస్తుండడంతో అదే మంచిదనే అభిప్రాయం వారిలో స్థిరపడిందన్నారు. కాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సాక్రెడ్‌ హార్ట్‌ కు చెందిన పరిశోధకులు కూడా రాత్రి సమయాల్లో పనిచేసేవారిపై పరిశోధనలు చేశారు. నైట్ లవర్స్ అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో నిష్ణాతులని తెలుసుకున్నారు. అదే విధంగా వేకువజామున చదివే వారికి కూడా మంచి గ్రేడ్లు సాధిస్తున్న విషయాన్ని వారు గమనించారు. అలాగే ఎక్కువ జీతాలు అందుకుంటున్నవారు రాత్రి వేళ పనిచేసే వారేనని తేలింది.

జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న చాలా మంది ప్రముఖులు నిశాచరులే. ప్రఖ్యాత నాన్‌ ఫిక్షన్‌ రచయిత మైఖేల్‌ లూయీస్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రఖ్యాత రచయిత ఫ్రాన్‌ లెబోవిజ్‌ ఫెడెక్స్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ లారీ టక్కర్‌, వీరంతా రాత్రివేళలో పనిచేయడానికే ఆసక్తి చూపేవారు. చేసే పనిలో నిబద్దతత ఉండాలే కానీ సమయం,ముహుర్తం ప్రభావం ఉండదని పరిశోధకులు చెప్తున్నారు ప్రపంచం నిద్రపోయాక రాత్రి ప్రశాంత వాతావరణంలో పని చేసి వారు మెరుగైన ఫలితాలు సాధించాలనే నేచర్ వారిలో ఉంటుందని అధ్యయనంలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories