
Ramadan 2026: ఇఫ్తార్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలలోనే ఖురాన్ అవతరించిందని నమ్ముతారు.
ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలలోనే ఖురాన్ అవతరించిందని నమ్ముతారు. ప్రతి ముస్లిం తెల్లవారుజామున 'సెహ్రీ'తో ఉపవాసాన్ని ప్రారంభించి, సూర్యాస్తమయం వరకు నీరు కూడా తాగకుండా కఠిన నియమాలు పాటిస్తారు. ఈ ఉపవాసం జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని ఇచ్చి శరీరాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. అయితే, ఉపవాసం విరమించే సమయంలో (ఇఫ్తార్) కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
* ఒకేసారి ఎక్కువ నీరు తాగడం
రోజంతా దాహంగా ఉన్నందున, ఇఫ్తార్ సమయంలో చాలామంది ఒకేసారి లీటర్ల కొద్దీ నీరు లేదా అతి చల్లని నీరు తాగుతుంటారు. ఇది చాలా తప్పు. దీనివల్ల కడుపులో భారం పెరిగి వికారం లేదా వాంతులు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో వాటర్‌ను నెమ్మదిగా, చిన్న చిన్న సిప్‌లుగా తాగాలన్నారు.
* సోడా & షుగర్ డ్రింక్స్
మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాలు, సోడాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వవు సరే కదా, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. దీనికంటే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం ఉత్తమం అని, ఎందుకంటే ఇవి తక్షణ శక్తిని ఇస్తాయన్నారు.
* నూనెలో వేయించిన పదార్థాలు
ఇఫ్తార్ అంటేనే రకరకాల వంటకాలు గుర్తొస్తాయి. కానీ సమోసాలు, పకోడీలు వంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఎసిడిటీ సమస్య తప్పదని హెచ్చరించారు. పండ్లు, నానబెట్టిన ఖర్జూరాలు వంటి తేలికపాటి ఆహారంతో ఉపవాసం విరమించడం ఉత్తమం అని సూచించారు.
* అతిగా స్వీట్లు తినడం
హల్వా, ఖీర్ వంటి తీపి పదార్థాలు రంజాన్ స్పెషల్. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. తీపి తినాలనిపిస్తే బెల్లంతో చేసిన వంటకాలు లేదా పండ్లను ఎంచుకోవాలని సూచించారు.
* భోజనం చేసిన వెంటనే పడుకోవడం
ఇఫ్తార్ తర్వాత శరీరం అలసిపోయినట్లు అనిపించి వెంటనే పడుకుంటారు. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదన్నారు. తిన్న తర్వాత కనీసం 20 నిమిషాల పాటు మెల్లగా నడవాలని, అలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందన్నారు.
అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు ఉపవాసం విషయంలో మినహాయింపు తీసుకోవడం మంచిదన్నారు. పైన చెప్పిన చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఈ పవిత్ర మాసాన్ని మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా గడపవచ్చని సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




