వర్షకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!

వర్షకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
x
Highlights

వర్షం పడుతుంటే ఆ జల్లులో తడవాలని చాలమంది అనుకుంటారు. వానలో తడిస్తే ఫస్ట్ వచ్చే సమస్య జలుబు. జలుబు సీజనల్ వ్యాధిగా చాలమందిని బాధపెడుతుంది. జలుబు వస్తే...

వర్షం పడుతుంటే ఆ జల్లులో తడవాలని చాలమంది అనుకుంటారు. వానలో తడిస్తే ఫస్ట్ వచ్చే సమస్య జలుబు. జలుబు సీజనల్ వ్యాధిగా చాలమందిని బాధపెడుతుంది. జలుబు వస్తే ఆ బాధ భరించటం నిజంగా కష్టమే. ఇలాంటి సమస్యలకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కల్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పసుపు, నల్లమిరియాలు, అల్లం, దాల్చినచెక్కను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి భోజనం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి. వీటితో పాటు తాజా కూరగాయలు, పండ్లు తింటే వర్షాకాలంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

వర్షం పడితుంటే.. వేడివేడి బజ్జీలు, ఫకోడి తినాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రమే వాటికి దూరంగా ఉండాలి. సాయంత్రం వేడివేడి హెర్బల్‌ టీ, స్నాక్స్‌ పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అంటున్నారు నిపుణులు. హెర్బల్‌ టీ శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోకి చేరిన హానికర బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

కాజూ, వాల్‌నట్‌, బాదం, ఖర్జూరం వంటివి ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి, వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను అడ్డుకుంటాయి. ప్రొటీన్లు, ప్రొబయాటిక్స్‌ మెండుగా ఉండే యోగర్ట్‌ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories