Rainy Season: వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే అంత ప్రమాదమా?

Rainy Season
x

Rainy Season: వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే అంత ప్రమాదమా?

Highlights

Rainy Season: వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. దీంతో వాటిని బాగా తినాలనిపిస్తుంది. అయితే ఈ కాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది.

Rainy Season: వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. దీంతో వాటిని బాగా తినాలనిపిస్తుంది. అయితే ఈ కాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి చాలా స్పీడ్‌గా స్ర్పెడ్ అయిపోతాయి. ఇలా స్పీడ్‌గా బ్యాక్టీరియా, వైరస్‌లు స్ర్పెడ్‌ అయ్యే కొన్ని కూరగాయలు ఉన్నాయి. వీటిని మాత్రం ఈ కాలంలో అసలు తినొద్దని నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలం అంటువ్యాధులకు అనువైన కాలం. ఎటువైపు నుంచైనా అంటువ్యాధులు ఎక్కువగా ఈ కాలంలోనే వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. ముఖ్యంగా తినే ఆహారాల విషయంలో కాంప్రమైజ్ కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇందులో ముఖ్యమైనవి.. ఒక ఐదు రకాల కూరగాయలు. వీటికి ఈ కాలంలో దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.

ఆకుకూరలు మంచివే కానీ..

ఆకుకూరలు చాలామంచివే. కానీ ఈ కాలంలో వాటికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటితోపాటే ఎక్కువగా కీటకాలు కూడా ఇంటికి వస్తాయి. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాటిని సలాడ్స్‌ లో తిన్నా చాలా ప్రమాదకరం. అందుకే జాగ్రత్తగా చూసుకుని తినాలి. లేదంటే కొన్నాళ్లు వీటికి దూరంగా ఉంటేనే బెటర్.

దుంపలు

ముల్లంగి, క్యారెట్ దుంపలను కూడా ఈ కాలంలో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవి మట్టిలో ఎక్కువగా పెరుగుతాయి. వర్షాకాలంలో ఈ మట్టిలోకి క్రిములు, కీటకాలు , బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వీటి మధ్యలో ఇవి పెరగడం వల్ల ఈ దుంపలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వీటిని తినకుండా ఉంటేనే మంచిది.

బెండకాయ, చిక్కుడుకాయ

ఈ కూరగాయలపై తేమ ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్‌ లు అయినా వీటిపై అతుక్కుపోయి ఉంటాయి. ఇవి త్వరగా పురుగు పట్టే సమయం కూడా ఇదే. కాబట్టి. వీటిని ఈ కాలంలో ఎవాయిడ్ చేయడం మంచిది.

క్యాబేజీ, కాలిఫ్లవర్

ఈ కూరగాయలను కూడా ఈ కాలంలో దూరంగా ఉంచాలి. వీటిపైన వర్షాకాలంలో బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోతుంది. దీనివల్ల పురుగులు ఎక్కువగా పడతాయి. అయితే చాలామంది ఆ పురుగులను తీసి వీటిని వండుతుంటారు. అసలు అలా చేయకూడదు. అలా తింటే జ్వరం, డయేరియాలాంటివి వచ్చే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories