Ragi Ambali Benefits: ఎండల నుంచి రక్షణకు అంబలి.. ఆరోగ్యానికి మేలు

Ragi Ambali Benefits: ఎండల నుంచి రక్షణకు అంబలి.. ఆరోగ్యానికి మేలు
x

Ragi Ambali Benefits: ఎండల నుంచి రక్షణకు అంబలి.. ఆరోగ్యానికి మేలు

Highlights

Ragi Ambali Benefits: వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నివారణకు రాగి అంబలి ఉత్తమ ఆహారం. పోషక విలువలు, తయారీ విధానం తెలుసుకోండి.

Ragi Ambali Benefits: ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సంప్రదాయ ఆహారాల్లో ఒకటైన అంబలి (రాగి జావ) ఎంతో ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు.

రాగులతో తయారయ్యే అంబలి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు నీటి లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం రాగిపిండి మాత్రమే కాకుండా బియ్యం, సజ్జలు, జొన్నలు కలిపి చేసిన అంబలి మరింత పోషక విలువలను అందిస్తుంది.

పోషక విలువలు

అంబలిలో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆరు నెలలు దాటిన పిల్లలకు కూడా ఇది సురక్షిత ఆహారంగా భావిస్తారు.

అవసరమైన పదార్థాలు

బియ్యప్పిండి – 3 స్పూన్లు

సజ్జ పిండి – 3 స్పూన్లు

జొన్న పిండి – 3 స్పూన్లు

రాగి పిండి – 1 కప్పు

ఉప్పు – తగినంత

నీరు – అవసరమైనంత

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో నీరు తీసుకుని రాగిపిండి కలిపి ఉండలు లేకుండా గిలక్కొట్టాలి. అందులో బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇంకో గిన్నెలో మూడు గ్లాసుల నీరు వేడి చేసి, మరిగే దశకు వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసిన మిశ్రమాన్ని నెమ్మదిగా పోయాలి. ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ చిన్న మంటపై ఉడికించాలి. కాస్త చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

వేసవికాలంలో రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ కలిపి తాగితే మరింత రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories