పుదీనా ఓ దివ్యౌషధం..

పుదీనా ఓ దివ్యౌషధం..
x
Highlights

పుదినా అకులు మన శరీరానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వాటి అకులను తరుచూ తినడం వల్ల సాధరణంగా వచ్చే జబ్బులకు దూరంగా ఉండవచ్చు. నోటి దుర్వాసనను మటుమాయం...

పుదినా అకులు మన శరీరానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వాటి అకులను తరుచూ తినడం వల్ల సాధరణంగా వచ్చే జబ్బులకు దూరంగా ఉండవచ్చు. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది. వంటల్లో దీన్ని వేయడం వల్ల వండిన పదార్థాలు సువాసనతో ఘుమఘుమ లాడిస్తాయి. పుదీనాకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా కూడా పనిచేస్తుంది.

పుదీనా ఆకులు శరీరంలోని రోగకారక క్రిములను అంతం చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటి నుంచి తీసిన మెంథాల్‌ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు. పుదీనా ఆకులు ఉన్న నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించుకోవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టిపడడమే కాక, చిగుళ్ల వ్యాధులూ దూరమవుతాయి. వీటి ఆకుల్లో ఉండే పీచుపదార్థాలు మాంస క త్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదం చేస్తాయి.పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అర గని పదార్థాలు సులువుగా అరుగుతాయి కడుపు నొప్పితో బాధపడేవారు పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుదీనాను రోజు తీసుకుంటే చాలా మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories