Public Toilets: పబ్లిక్ టాయిలెట్స్ వల్ల UTI వస్తుందా? నిపుణుల అసలు నిజం

Public Toilets: పబ్లిక్ టాయిలెట్ సీట్లు వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుందా? అసలు కారణాలు ఏమిటి? ఎలాంటి అలవాట్లు UTIకి దారి తీస్తాయో నిపుణుల వివరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Feb 2026 4:18 PM IST
Public Toilets: పబ్లిక్ టాయిలెట్స్ వల్ల UTI వస్తుందా? నిపుణుల అసలు నిజం
X

Public Toilets: పబ్లిక్ టాయిలెట్స్ వల్ల UTI వస్తుందా? నిపుణుల అసలు నిజం

Public Toilets: షాపింగ్ మాల్స్, ట్రావెల్ సమయంలో పబ్లిక్ టాయిలెట్స్ వాడటం సాధారణమే. అయితే టాయిలెట్ సీటు వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వస్తుందనే భయం చాలామందిలో ఉంది. కానీ ఈ భయం ఎక్కువగా అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు సమస్య టాయిలెట్ సీటులో కాదని, వ్యక్తిగత అలవాట్లలోనే ఉందని స్పష్టం చేస్తున్నారు.

నిపుణుల ప్రకారం యూరినరీ ఇన్ఫెక్షన్లలో దాదాపు 90 శాతం కేసులు శరీరంలోనే ఉండే E.coli వంటి బ్యాక్టీరియా వల్లే వస్తాయి. ఇవి మలద్వారం నుంచి మూత్రనాళంలోకి చేరినప్పుడు ఇన్ఫెక్షన్ ప్రారంభమవుతుంది. టాయిలెట్ సీటు ద్వారా నేరుగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

టాయిలెట్ సీట్లు సాధారణంగా ప్లాస్టిక్ లేదా సిరామిక్‌తో తయారవుతాయి. ఇవి పొడిగా ఉండే ఉపరితలాలు కావడంతో బ్యాక్టీరియా ఎక్కువసేపు బతకలేవని వైద్యులు చెబుతున్నారు. పైగా సీటుతో శరీరానికి నేరుగా ప్రమాదకర భాగాల సంపర్కం ఉండదు.

అయితే ఇన్ఫెక్షన్ భయంతో సీటుకు తగలకుండా గాల్లో వంగి మూత్ర విసర్జన చేయడం ప్రమాదకరం. ఇలా చేస్తే బ్లాడర్ పూర్తిగా ఖాళీ కాక, లోపల మిగిలిన యూరిన్ వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే టాయిలెట్ శుభ్రంగా లేదని ఎక్కువసేపు మూత్రం ఆపుకోవడం, నీళ్లు తక్కువగా తాగడం కూడా UTIకి దారి తీస్తాయి.

టాయిలెట్ వాడిన తర్వాత వెనుక నుంచి ముందుకు తుడుచుకోవడం కూడా ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ ముందు నుంచి వెనుక వైపు (Front to Back) శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు అవసరమైతే సీటును టిష్యూ‌తో తుడిచి వాడటం, చేతులు సబ్బుతో కడుక్కోవడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story