పసుపు ఉపయోగాలు ఏంటో తెలుసా?

పసుపు ఉపయోగాలు ఏంటో తెలుసా?
x
Highlights

పసుపుకు భారతీయ సంప్రదాయంలో అధికమైన ప్రాధన్యత ఉంది. దాన్ని మనం శుభప్రదంగా భావిస్తాం. పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా పసుపును ఎక్కువగా...

పసుపుకు భారతీయ సంప్రదాయంలో అధికమైన ప్రాధన్యత ఉంది. దాన్ని మనం శుభప్రదంగా భావిస్తాం. పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తాం. దానికి ముఖ్యకారణం పసుపులో ఔషధ గుణాలు ఉండడమే. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నట్లు వివిధ పరిశోధనల్లో తేలింది.

పసుపు ఆర్యోగానికి ఎంతో ఉపకారం చేసే అయుర్వేదమని శాస్త్రవేత్తలు తల్చారు.

అమెరికా చెందిన ఎండీ అండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో పసుపు ఔషదగుణాలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు పరిశోధకులు వివరించారు.అలాగే, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, అల్జిమర్స్ జీవక్రియలకు సంబంధించిన వ్యాధులను నిరోధించడంలో పసుపు తోడ్పాడుతుందని అధ్యయనం ద్వారా తేలింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories