Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తో బీపీకి చెక్

Proven Dark Chocolate Benefits for Skin and Weight Loss
x

డార్క్ చాక్లెట్ తో బీపీకి చెక్ 

Highlights

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Dark Chocolate Benefits: చాక్లెట్ తో లవ్ లో పడనివారుండరు. పిల్లలైతే అది ఇస్తామంటే ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతారు. ఆఖరికి కుర్రాళ్లు సైతం లవ్ లీ గాళ్స్ కి లవ్ ప్రపోజల్ చేసే ముందు ఈ చాక్లెట్ తోనే ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తారు. వయసుతో పని లేకుండా ఎవరైనా ఇష్టపడేది చాక్లెట్.. అందులో ఏ డౌట్ లేదు. అయితే డయాబెటికి, బీపీ ఉన్నవారికి, ఏజ్ ఎక్కువైనవారికి, వెయిట్ ఎక్కువున్నవారికి అవసరమైన చాక్లెట్ డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ మేలు తప్ప కీడు చేయదని చెబుతున్నారు. ఆఖరిని బిపిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందంట.ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో మన లైఫ్ స్టైల్ లో తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ మీ శరీరంలో సహజంగా సంభవించే పదార్ధం. ఇది రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.

డార్క్ చాక్లెట్ లో ఎక్కువగా ఉన్న విటమిన్లు మరియు మినరల్స్ పొటాషియం, కాపర్ మెగ్నీషియం ఐరన్ డార్క్ చాక్లెట్ లో కాపర్ మరియు పొటాషియం గుండె పోటు మరియు కార్డియో వాస్క్యులర్ రోగాలకు నిరోధించడానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చాక్లెట్ లోని ఐరన్, రక్తంలో ఐరన్ లోపించకుండా, అనీమియాకు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది,

అప్పుడప్పుడు చాక్లెట్ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారుడార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనగా ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తుంది. అదేవిధంగా, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

డార్క్ చాక్లెట్ మెదడు అలాగే గుండెకు రక్త ప్రసరణ పెంచుతుంది. యాక్టీవ్ నెస్, ఫ్రెష్ నెస్ పెరుగుతుంది. అంతే కాదు డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం నుండి కూడా తప్పించుకోవచ్చట. డార్క్ చాక్లెట్ వుండే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. దాని వల్ల శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్లను, వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చు.

డార్క్ చాక్లెట్ లో వుండే ప్లావనాయిడ్స్ శరీరంలో ఇన్సులిన్ ను క్రమబద్దీకరిస్తుంది. దీనిలో వుండే గ్లైసిమ్ ఇండెక్స్ ను కలిగి వుండడం వల్ల షుగర్ లెవల్స్ స్థిరీకరిస్తుంది. సో షుగర్ తో బాధపడే వారు డార్క్ చాక్లెట్ తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకోవచ్చు.డార్క్ చాక్లెట్ వుండే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. దాని వల్ల శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్లను, వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చు. సో ఇంకనుంచి నిరభ్యంతరంగా డార్క్ చాక్లెట్ ను తక్కువ మోతాదులో రెగ్యలర్ గా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories