కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెట్టే విధానాలు

కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెట్టే విధానాలు
x
Highlights

ఈ మధ్యకాలంలో అందరినీ కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తోంది. దీనికి కారణం మారిన మానవ జీవనశైలే అని అంటున్నారు వైద్యులు... సమయానికి ఆహారం తీసుకోకపోవడం......

ఈ మధ్యకాలంలో అందరినీ కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తోంది. దీనికి కారణం మారిన మానవ జీవనశైలే అని అంటున్నారు వైద్యులు... సమయానికి ఆహారం తీసుకోకపోవడం... శరీరానికి అవసరమైన నీటిని అందింకపోవడంతో పాటు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

కిడ్నీల్లో రాళ్లు చేరడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా విపరీతమైన నొప్పి వస్తుంది. శరీరాన్ని అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నారు. అందులోనూ 20 నుంచి 40 సంవత్సరాల లోపు వారిని ఈ సమస్య పట్టి పడీస్తుంటుంది.

శరీరంలోని మలినాలను ఎక్కువగా విసర్జించే ఈ మూత్రపిండాలు...శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పడు తొలగిస్తూ ఉంటాయి. కానీ అదే నీరు సరిపడా శరీరంలో లేకపోతే మట్టుకు రాళ్ల సమస్య వచ్చి చేరుతుంది...అదే విధంగా మూత్రంలో అతిగా ఉండే కొన్న రసాయనాల వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయట... ఈ రాళ్లు కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ , యూరిక్ ఆమ్లం వల్ల ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

చిన్న చిన్న రాళ్లు కిడ్నీల్లో ఏర్పడితే...మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి కానీ పెద్ద రాళ్లు ఏర్పడితే మాత్రం మూత్రం వచ్చే మార్గము దెబ్బతింటుంది. కాబట్టి సమస్య పెద్దగా అయయాక బాధపడేకంటే...దానిని నివారించేందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యం శరీరానికి అవసరమైన నీటిని తాగుతూ ఉండాలి. రోజులో కనీసం 8 లీటర్ల నీటిని తీసుకుంటూ ఉండాలి..నీరు లేక పోతే జ్యూస్‌లైన ద్రవపతార్ధాలను సేవిస్తూ ఉండాలి. తీసుకునే ఆహారంలో కాల్షియం సమృద్ధిగా ఉండే విధంగా చూసుకోవాలి.

అక్సలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోకూడదు...వీటిని ఎక్కవగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పాటించాలి.

ఆహారంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి...సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల యూరిన్‌లో కాల్షియం శాతం పెరిగి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. అంతే కాదు కిడ్నీలకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. సోడా, కార్బోనేటెడ్ కూల్‌డ్రింక్‌లు త్రాగకపోతేనే మంచింది. ఈ పానియాల వల్ల మూత్ర పిండాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఇక రాత్రి వేళలో మెంతులను గ్లాసుడు నీటిలో నానబెట్టాలి..ఆ నీటిని ఉదయమే తాగాలి. దీని వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే కరిగిపోతాయి. అరటి చెట్టు బెరడు ను జ్యూస్ చేసి తాగినా చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories