Heat Stroke: హిట్ స్ట్రోక్ గురవ్వకుండా ఉండాలంటే.. ఈ 5 సమ్మర్‌ డ్రింక్స్‌ తాగాల్సిందే

Heat Relief Drinks
x

Heat Stroke: హిట్ స్ట్రోక్ గురవ్వకుండా ఉండాలంటే.. ఈ 5 సమ్మర్‌ డ్రింక్స్‌ తాగాల్సిందే

Highlights

Heat Relief Drinks: ఎండ సమయం వేడి విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హిట్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది.

Heat Relief Drinks: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ బీభత్సం సృష్టిస్తుంది. ఎండ వేడిమి వల్ల విపరీతంగా అలసట, నీరసం కలుగుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మీ డైట్ లో కచ్చితంగా కొన్ని సమ్మర్‌ డ్రింక్స్ చేర్చుకోవాలి. తద్వారా మీరు హిట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా ఉంటారు. ఈరోజు అలాంటి సమ్మర్‌ డ్రింక్స్‌ ఏంటో తెలుసుకుందాం.

కొబ్బరి నీరు ..

హిట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా ఉండాలంటే ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్న కొబ్బరినీళ్లు తప్పకుండా తీసుకోవాలి. ఇందులో సహజ సిద్ధంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ కూడా ఇది సహజసిద్ధంగా అందిస్తుంది. తక్షణ శక్తిని కూడా ఇది ఇస్తుంది. ఎండాకాలం కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగాల్సిందే.

కొబ్బరి బోండాం మాత్రమే కాదు కొన్ని ఈ నీటితో తయారు చేసిన కొన్ని డ్రింక్స్‌ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించి, డిహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతాయి. అంతేకాదు చర్మానికి కూడా మంచి పోషణ అందిస్తాయి.

మజ్జిగ..

మజ్జిగ కూడా మంచి చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటుంది. పెరుగుతో తయారు చేసే ఈ మజ్జిగ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీవన సమస్యలు తగ్గిపోతాయి. కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. కడుపులో మంచి బాక్టీరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. మజ్జిగలో మనకు రోజంతటికీ కావాల్సిన శక్తి ఇస్తుంది.

ఆమ్ పన్నా..

మామిడి పండుతో తయారు చేసే ఆమ్‌ పన్నా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇది హీట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇతర మసాలాలు వేసుకొని తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగవుతుంది. ఇది ఎండ వేడిమి నుంచి కూడా తక్షణ రిలీఫ్ అందిస్తుంది. దీనితో సమ్మర్ హీట్‌కు కూడా గురవ్వకుండా ఉంటారు.

నీరు..

ఎండాకాలంలో తగినంత నీరు తీసుకోవాలి. లేకపోతే డిహైడ్రేషన్ కూడా గురవుతారు. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన నీటిని రెగ్యులర్‌గా తాగుతూ ఉండండి. దాహం వేయకున్నా నీరు తాగే అలవాటు చేసుకోవడం వల్ల వడదెబ్బకు గురవ్వకుండా ఉంటారు.

లెమనేడ్‌..

లెమనేడ్‌ ఇది తాజా నిమ్మకాయలతో తయారుచేస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఆల్కలైన్ నిలుపుకోవడానికి తోడ్పడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇది రోజంతటికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో సహజ చల్లదనాన్ని అందించే గుణాలు ఉంటాయి. దీంతో రోజంతటికీ కావాల్సిన శక్తి కూడా అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories