Delicious Recipe: ఘుమఘుమలాడే వెరైటీ సేమియా చికెన్ బిర్యానీ

Delicious Recipe: ఘుమఘుమలాడే వెరైటీ సేమియా చికెన్ బిర్యానీ
x
Highlights

సేమియాతో ఎక్కువగా స్వీట్ అయితే మనం పాయాసం, లేదా ఉప్మా చేసుకుంటాము.

సేమియాతో ఎక్కువగా స్వీట్ అయితే మనం పాయాసం, లేదా ఉప్మా చేసుకుంటాము. ఈ రెండూ మనకు తెలిసిన వంటకాలే..రొటీన్ గా వీటిని మనం తీసుకుంటూనే ఉంటాం...కానీ దీనికి భిన్నంగా సేమియాతో కూడా స్పైసీ బిర్యానీ చేయవచ్చు..వెరైటీ రుచులను తినాలనుకునే వారికి ఈ సేమియా చికెన్ బిర్యాని మంచి టేస్ట్ ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు..

కావాల్సిన పదార్ధాలు:

♦ సేమియా : రెండు కప్పులు

♦ చికెన్‌ : ఒక కప్పు

♦ ఉల్లిగడ్డ : ఒకటి

♦ *జీరా పౌడర్ : టేబుల్ స్పూన్

♦ కారం : రుచికి సరిపడా

♦ పుదీనా : అర కప్పు

♦ కొత్తిమీర : అర కప్పు

♦ టమాట : ఒకటి

♦ అల్లంవెల్లుల్లిపేస్ట్ : రెండు టేబుల్ స్పూన్‌లు

♦ పచ్చిమిర్చి : రెండు

♦ బిర్యానీ మసాలా : రెండు టేబుల్ స్పూన్‌లు

♦ పసుపు : అర టీస్పూన్‌

♦ గరం మసాలా : రుచికి సరిపడా

♦ పెరుగు : ఒక కప్పు

♦ నెయ్యి : టేబుల్ స్పూన్

♦ నూనె : టేబుల్ స్పూన్

♦ ఉప్పు : రుచికి సరిపడా

తయారీ విధానం:

చికెన్‌ను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్‌ ముక్కలను తీసుకుని ముందుగా పెరుగు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలిపి చికెన్‌ను మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్‌ను మ్యారినేట్ చేయడం వల్ల బిర్యానికి మంచి టేస్ట్ వస్తుంది.

ఇప్పుడు సేమియాను తీసుకుని అందులో రెండు కప్పుల వాటర్‌ ను యాడ్ చేసుకుని కాసేపు మరగనివ్వాలి. నీరు మసిలేప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి..అదే విధంగా నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అండుకోకుండా పొడిపొడిలాడుతుంది. ఇప్పుడు సేమియాను బాగా కలుపుకోవాలి. పొడిగా అయ్యేంత వరకు సేమియాను కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోకుండా మీడియం మంట మీదే ఉండనివ్వాలి. సేమియాను పూర్తిగా కుక్ చేసుకోకుండా పలుకుగా ఉన్నప్పుడూ నీరు వడకట్టుకుని సేమియాను తీసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె, నెయ్యి వేసి కాస్త వేడి చేయాలి. అనంతరం గరం మసాలాలు అన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్‌ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కట్‌చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు పుదీనా ఆకులు, కొత్తిమీర, జీరా పౌడర్ వేసుకుని వేయించాలి. ఇవన్నీ బాగా కుక్ అయిన తరువాత అల్‌రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ ను ఇందులో వేయాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ ను బాగా ఉడకనివ్వాలి.ద ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సేమియా వేయాలి. మసాలా అంతా సేమియాకు పట్టనివ్వాలి. మూత పెట్టుకుని సిమ్‌లో ఆవిరి మీద 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇంకేముంది వేడి వేడి వెరైటీ సేమియా చికెన్ బిర్యానీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories