రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీ ఎలా?

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీ ఎలా?
x
Highlights

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి డ్రై ఫ్రూట్స్. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి.

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి డ్రై ఫ్రూట్స్. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉపవాస దీక్షలు చేసే వారు డ్రైఫ్రూట్స్ ను తినడం వల్ల నీరసం తగ్గుతుంది. పిల్లలకు వీటిని తప్పనిసరిగా అందించాలి.. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. అందుకే వారికి నచ్చే విధంగా టేస్టీగా లడ్డూలను తయారు చేసుకుని వారికి తినిపించవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డూ తయారు చేయడం ఎలాగో ఇలా తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

బాదం పప్పు

♦ ఖర్జూరం

♦ పిస్తా

♦ జీడి పప్పు

♦ అప్రికాట్స్‌

♦ ఫిగ్స్

♦ ఎండు కొబ్బరి

♦ నువ్వులు

♦ నెయ్యి

తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకోవాలి... స్టవ్ ఆన్‌ చేసి కడాయిని పెట్టుకోవాలి... ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి . నెయ్యి కాస్త వేడయ్యాక అందులో పావు కప్పు బాదంపపప్పు , పావు కప్పు జీడిపప్పు వేసుకోవాలి . బాగా వేగించాలి. ఇప్పుడు పావుకప్పు పిస్తా కూడా అందులో వేసుకోవాలి.. వీటిని కాసేపు వేయించుకోవాలి . ఇప్పుడు వీటన్నింటిని తీసుకుని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఆ తరువాత ఇప్పుడు ఐదు అప్రికాట్స్‌ , 4 ఫిగ్స్‌ కడాయిలో వేసుకుని కాస్త రోస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు పావు కప్పు ఖర్జూరం పండ్లను తీసుకోవాలి... వీటితో ఫిగ్స్ , అప్రికాట్స్ ను కలుపుకుని మిక్సీ జార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.. తరువాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు , బాదంపప్పు, పిస్తా లను ఈ మిశ్రమంలో వేసుకోవాలి . బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చేసుకునేందుకు వీలుగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్‌ల ఎండుకొబ్బరి, రెండు టేబుల్ స్పూన్ ల నువ్వులు వేసుకోవాలి . లడ్డూలను తయారు చేసుకుంటూ పైన అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాల.ఇ అంతే డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories