Potassium: పొటాషియం పుష్కలంగా ఉండే ఈ 5 తింటే రక్తపోటు బార్డర్ దాటదు..

Potassium Rich Foods
x

Potassium: పొటాషియం పుష్కలంగా ఉండే ఈ 5 తింటే రక్తపోటు బార్డర్ దాటదు..

Highlights

Potassium Rich Foods: మన శరీరంలో పొటాషియం కూడా ఎంతో అవసరమైన ఖనిజం. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కండరాల బలానికి కూడా సహాయపడుతుంది.

Potassium Rich Foods: పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. మీ శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే అవేంటో తెలుసుకుందాం.

అరటి పండు..

మనందరికీ తెలిసిందే అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక అరటి పండులో 420 గ్రాముల పొటాషియం ఉంటుంది. దీని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి పొటాషియం అంది. రక్తపోటు అదుపులో ఉంటుంది దీన్ని స్నాక్ మాదిరి కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ సహజమైన చక్కెరలు ఉంటాయి.

పాలకూర..

పాలకూరలు కూడా పొటాషియం ఉంటుంది. దీన్ని ఆకుకూర, పప్పు రూపంలో చేసుకొని తినవచ్చు. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అవకాడో ..

అవకాడోలో ఉండే పొటాషియం వల్ల మన గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి. దీన్ని సలాడ్ లేదా టోస్ట్, స్మూథీ రూపంలో తీసుకోవచ్చు. ఆవకాడో చర్మ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

యోగార్ట్‌..

మన దగ్గర డైట్ లో యోగార్ట్‌ చేర్చుకోవడం వల్ల కూడా ఇది ఒక పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గ్రీక్ యోగార్ట్‌ డైట్‌లో చేర్చుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఇందులో మీరు కావాలంటే కొన్ని రకాల పండ్లు, గింజలు వేసుకొని తినవచ్చు. గ్రీక్‌ యోగార్ట్‌ శరీరానికి కావాల్సిన పొటాషియం అందుతుంది.

ఆరెంజ్‌..

ఇవి కాకుండా ఆరెంజ్ వంటి సీట్రాస్ పండు తీసుకోవడం వల్ల కూడా పొటాషియం అందుతుంది. విటమిన్ సి, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి పొటాషియం అందుతుంది. ఆరెంజ్‌ రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యానికి.. కండరాల పని సహాయపడుతుంది. ఆరెంజెస్ మంచి సమతుల ఆహారం.

Show Full Article
Print Article
Next Story
More Stories