Popcorn vs Banana Chips: పాప్ కార్న్ VS అరటిపండు చిప్స్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Popcorn vs Banana Chips
x

Popcorn vs Banana Chips: పాప్ కార్న్ VS అరటిపండు చిప్స్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Highlights

Popcorn vs Banana Chips: పాప్ కార్న్, బనానా చిప్స్ రెండూ నోరూరించే స్నాక్స్. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ రెండు స్నాక్స్ ఒక్కసారి అలవాటు అయితే వీటిని తినకుండా ఉండలేం.

Popcorn vs Banana Chips: పాప్ కార్న్, బనానా చిప్స్ రెండూ నోరూరించే స్నాక్స్ . చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ రెండు స్నాక్స్ ఒక్కసారి అలవాటు అయితే వీటిని తినకుండా ఉండలేం. కొంత మంది పాప్ కార్న్ తినడానికి ఇష్టపడతారు. ఇంకొంత మంది బనానా చిప్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?


మొక్కజొన్న

మొక్కజొన్న నుండి పాప్‌కార్న్ తయారు చేస్తారు. మొక్కజొన్న గింజలను వేడి చేసినప్పుడు గింజల లోపల ఉన్న నీరు ఆవిరిగా మారి, గింజలు ఉబ్బుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పాప్‌కార్న్ ఆరోగ్యకరమైన చిరుతిండిగా భావిస్తారు. ఎందుకంటే ఇది తక్కువ కేలరీలు అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది. పాప్‌కార్న్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పాప్‌కార్న్ యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇది కణజాలాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది. ఇది ఇతర స్నాక్స్ కంటే శుభ్రంగా తయారు చేస్తారు కాబట్టి దీనిని తినడంలో ఎటువంటి సమస్య ఉండదు.

అరటిపండు చిప్స్

అరటిపండు చిప్స్ మనకు ఆరోగ్యకరమైనవిగా అనిపించవచ్చు. అవి అరటిపండ్ల నుండి తయారవుతాయి కాబట్టి ఆరోగ్యానికి మంచివని అనుకుంటాము. కానీ వాటిని వేయించడానికి ఉపయోగించే నూనె, వాటి రుచిని పెంచడానికి ఉపయోగించే పదార్థాల గురించి మనకు తెలియదు. కాబట్టి, వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఏది మంచిది?

పాప్ కార్న్ ను మసాలాలు లేకుండా తయారు చేసుకోని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇందులో సహజంగా చక్కెర తక్కువగా ఉంటుంది. వీటిని మితంగా తింటే పర్వలేదు కానీఎక్కువగా తింటే కడుపు సమస్యలు వస్తాయి. అరటిపండు చిప్స్ ను వివిధ రకాల నూనెలో వేయిస్తారు. అంతే కాకుండా వాటి రుచిని మరింత పెంచడానికి చక్కెర, ఇతర పదార్థాలు కూడా కలుపుతారు. అందువల్ల వాటిని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మీరు ఈ రెండింటినీ పోల్చి చూస్తే, పాప్‌కార్న్ మంచిదని చెప్పవచ్చు. మరోవైపు, మీరు అరటిపండు చిప్స్ తినాలని అనిపించినప్పుడు, వాటిని ఇంట్లో తయారు చేసుకోని తినడం మీ ఆరోగ్యానికి మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories