పాప్ కార్న్ బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే..

పాప్ కార్న్ బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే..
x
Highlights

పాప్ కార్న్ అబ్బా.. ఆ పేరు వినగానే తినాలనిపిస్తుంది కదా..! జర్నీలో పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేసే వాళ్లు చాల మంది ఉన్నారు. ఎక్కువ మంది బీచ్ దగ్గర...

పాప్ కార్న్ అబ్బా.. ఆ పేరు వినగానే తినాలనిపిస్తుంది కదా..! జర్నీలో పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేసే వాళ్లు చాల మంది ఉన్నారు. ఎక్కువ మంది బీచ్ దగ్గర కూర్చోని పాప్ కార్న్ తింటానికి ఇష్టపడుతుంటారు. బీచ్ తీరమంతా పాప్ కార్న్ నే ఉంటే.. అబ్బా భలే ఉంటుంది. మరి అలాంటి బీచ్ ఎక్కడుందంటే స్పెయిన్‌లో ఉంది. కేనరీ దీవుల్లో ఉన్న ఆ బీచ్ తీరమంతా పాప్ కార్న్ ని పోలి ఉంటుంది.

తెల్లటి పేలాల్లాంటివి లక్షలాదిగా బీచ్‌ అంతా పరుచుకుని ఉంటాయి. ఒక్కసారిగా చూస్తే బోలెడు పాప్ కార్న్ తెచ్చి ఎవరైనా బీచ్‌లో పడేసేరా అనేలా ఉంటుంది. కానీ అవన్నీ నిజం పాప్ కార్న్ కాదు.. అలాగని ఇసుకా కాదు. సాధరణంగా బీచ్ లో ఇసుక ఉంటుంది. ఇక్కడ ఉన్న బీచ్ లో పాప్ కార్న్‌లా కనిపించేవి ఇసుకో లేక రాళ్లో కాదు. అవి ఓ రకమైన చిన్న పగడపు దిబ్బలు. అవే ఈ తీరంలో పరుచుకుని అలరిస్తున్నాయి. అయితే ఈ తీరంలో కూర్చుని ఎంజాయ్ చేయటానికి ఈ పాప్‌కార్న్‌లు.. ఇసుక అంత సౌకర్యంగా ఉండవు. అయినా సరే అచ్చంగా పాప్ కార్నల్ లా ఉండే ఈ దిబ్బలను.. చూడ్డానికే పర్యటకులు ఈ తీరానికి రావటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories