Parenting Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు ఎప్పుడూ చేయకూడదు..!

Parenting Tips
x

Parenting Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు ఎప్పుడూ చేయకూడదు..!

Highlights

Parenting Tips: చిన్న పిల్లలు పెద్దలు చేసే పనిని చూసి త్వరగా నేర్చుకుంటారు. మంచి అయినా చెడు అయినా వాటిని త్వరగా గ్రహిస్తారు. కానీ చెడును మాత్రం ఈజీగా అలవాటు చేసుకుంటారు.

Parenting Tips: చిన్న పిల్లలు పెద్దలు చేసే పనిని చూసి త్వరగా నేర్చుకుంటారు. మంచి అయినా చెడు అయినా వాటిని త్వరగా గ్రహిస్తారు. కానీ చెడును మాత్రం ఈజీగా అలవాటు చేసుకుంటారు. కాబట్టి, తల్లిదండ్రులు పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, మీరు ఎలా ప్రవిస్తారో మీ పిల్లలు కూడా అలానే తయారు అవుతారని చెబుతున్నారు. అందువల్ల, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు ఎప్పుడూ చేయకూడదని సూచిస్తున్నారు. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాదించుకోవడం

భార్యాభర్తలు తమ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించుకోకూడదు. ఎందుకంటే, ఇది ఖచ్చితంగా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వారు కూడా అదే విధంగా ఇతరులతో వాదించే అవకాశం ఉంది. కాబట్టి, మీ పిల్లల ముందు ఎప్పుడూ కూడా వాదించుకోకండి.

చెడుగా మాట్లాడటం

తల్లిదండ్రులు అయినా లేదా ఇంట్లో మరెవరైనా అయినా, పిల్లల ముందు ఎప్పుడూ చెడు పదాలు వాడకూడదు. పిల్లల చెడు పదాలను వింటే వాటిని పదే పదే అంటారు. వారు కూడా ఈ చెడు పదాలను త్వరగా నేర్చుకుంటారు. కాబట్టి, తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లల ముందు చెడు పదాలు వాడకూడదు.

మొబైల్ చూడటం

తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నప్పుడు గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూడటం లేదా ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం చేయకూడదు. మీరు మీ పిల్లలకు సమయం ఇవ్వడానికి బదులుగా మీ మొబైల్ ఫోన్‌లో సమయం గడుపుతుంటే, మీ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు తమను ప్రేమించడం లేదని భావిస్తారు. అలాగే, పిల్లలు కూడా తమకు మొబైల్ ఫోన్ ఇవ్వాలని పట్టుబడుతారు.

చెడు అలవాట్లు

మీ పిల్లల ముందు మద్యం సేవించడం లేదా సిగరెట్లు కాల్చడం వంటి చెడు అలవాట్లకు పాల్పడకండి. ఎందుకంటే పిల్లలు మీలాగే చేసే అవకాశం ఉంది. మీ ఈ అలవాట్లు పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ఇతరులను విమర్శించడం

మీ పిల్లల ముందు ఇతరుల గురించి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకండి లేదా వారి గురించి గాసిప్ చేయకండి. ఎందుకంటే పిల్లలు కూడా ఈ అలవాటును అలవర్చుకునే అవకాశం ఉంది.

నిరంతరం తిట్టడం

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేసినా నిరంతరం తిట్టడం వంటివి చేస్తుంటారు. అలా తిట్టడం వల్ల పిల్లల మనోభావాలఉ దెబ్బతింటాయి. మనం ఏమి చేసినా అమ్మా నాన్న మనల్ని తిడతారని వారు మనసులో మీ గురించి చెడుగా అనుకుంటారు. ఇది వారి అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories