Paneer Side Effects: ఈ వ్యాధులతో మీరు బాధపడుతుంటే.. అసలు పనీర్ తినొద్దు..!

Who Should Not Eat Paneer: పనీర్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమంది పనీర్ తినకూడదు.

Indira Ram
Published on: 25 Jun 2025 2:34 PM IST
Paneer Health Benefits Who Should Avoid
X

Paneer Side Effects: ఈ వ్యాధులతో మీరు బాధపడుతుంటే.. అసలు పనీర్ తినొద్దు..!

Who Should Not Eat Paneer: పనీర్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమంది పనీర్ తినకూడదు. ఎందుకంటే వారికి అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే అవి పనీర్ తినడం వల్ల రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్లు పనీర్ ని తీసుకోకూడదు.

ఈ మధ్య కాలంలో పనీర్‌‌ తినడం ఎక్కువైంది. ముఖ్యంగా ఫంక్లన్లు, పార్టీలతో పనీర్ వాడకం బాగా పెరిగింది. ఆవు లేదా గేదె పాలతో తయారుచేసే ఈ పనీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఎంతో అవసరం. ఈ పనీర్ వంటకం శాఖాహారులకు బెస్ట్ ఫుడ్.

పనీర్‌‌తో ప్రయోజనాలు

పనీర్‌‌లో ఉండే ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి దోహదపడతాయి. అలాగే మరమ్మత్తులు చేయడానికీ ఉపయోగపడతాయి. అదేవిధంగా పనీర్‌‌లో ఉండే కాల్సియం ఎముకల ధృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. దంతాలకూ మంచిది. బరువు తగ్గేవారికి పనీర్ బెస్ట్ ఫుడ్. ఎందుకంటే కొంచెం తింటేనే పొట్ట పుల్ అయిపోతుంది. దీంతో బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. అదేవిధంగా పనీర్ లో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌‌ని పెంచుతాయి. దీనివల్ల అంటువ్యాధులు అంటుకోవు.

ఎవరు పనీర్ తినొద్దు..

లాక్టోస్ ఎక్కువ ఉన్నవారు పనీర్ తీసుకోకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే పనీర్‌‌లోనే లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే లాక్టోస్ లెవెల్స్ ఎక్కువై కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా పనీర్ కూడా ఎక్కువగా తినకూడదు. పనీర్‌‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారికి ఇది అసలు మంచిది కాదు. ఒకవేళ ఎక్కువగా తింటే గుండె సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉటుంది.

కిడ్నీ సమస్యలున్నవారు కూడా పనీర్‌‌ని ఎక్కువగా తీసుకోకూడదు. పనీర్‌‌లో ఉండే ప్రోటీన్ కిడ్నీలపై ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల అప్పటికీ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మరిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అలర్జీ ఉన్నవాళ్లు కూడా పనీర్ తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే పనీర్‌‌ను పాలు విరుగుడుతో తయారుచేస్తారు. చాలామంది పాల ఉత్పత్తులతో అలర్జీ వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు పనీర్‌‌కు దూరంగా ఉండాలి. పనీర్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మితంగా తినాలి.

Indira Ram

Indira Ram

Next Story